వైఎస్ వివేక కేసులో సిబిఐ మళ్ళీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా సిబిఐ వేసిన అడుగులు అనూహ్యంగా ఉన్నాయి. ఏకంగా పులివెందులలో జగన మోహన్ రెడ్డి ఇంటిని ఫోటోలు తీయటం, సర్వే చేయటంతో, ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. అలాగే అవినాష్ రెడ్డి ఇంటిని కూడా సర్వే చేసారు. భారతీ తండ్రి హాస్పిటల్ లో కూడా సిబిఐ సర్వే చేసింది. వీటి అన్నిటి నేపధ్యంలో, వివేక కేసులో ఏమి జరుగుతుంది అంటూ అందరూ చర్చించుకుంటున్న వేళ, తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టారు. వివేకాను చంపిన తరువాత, దస్తగిరి తప్ప, మిగతా వారు మొత్తం వివేక ఇంటి గోడ దూకి, అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారని అన్నారు. అలాగే కొంత మంది భారతి తండ్రి హాస్పిటల్ కు వెళ్లి, అక్కడ నిద్రించారని చెప్పారు. ఈ విషయాలు అన్నీ, వాళ్ళ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా సిబిఐ గుర్తించిందని, అందుకే సిబిఐ సర్వేలు చేస్తుందని అన్నారు. సాక్ష్యాలు తారుమారు చేస్తారనే ఉద్దేశంతోనే, సిబిఐ పక్కాగా మొత్తం రికార్డు చేస్తుందని తెలిపారు. మొత్తానికి, అసలు విషయం బీటెక్ రవి చెప్పారు.
వివేక కేసులో సంచలన విషయాలు బయటకు.. అందుకే అవినాష్ రెడ్డి ఇంట్లో సిబిఐ..
Advertisements