రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా తయారు అవుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయి, ఉపాధి అవకసాలు లేక, చివరకు ఇప్పుడు పదవ తరగతి ఫలితాలు చూస్తే, మన చదువులు ఎలా ఉన్నాయి అనేది కూడా అర్ధం అవుతుంది. ఏ రంగంలో కూడా ఏపి ముందుకు వెళ్ళటం లేదు. అన్ని వైపుల నుంచి ప్రజలకు ఉక్కపోత మొదలైంది. వ్యవసాయం దెబ్బ తిని, పరిశ్రమలు లేక, చదువులు దెబ్బ తిని, రోడ్లు దెబ్బ తిని, కరెంటు లేక, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రజలు అన్ని వైపుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఇక బాదుడే బాదుడు అయితే నెక్స్ట్ లెవెల్. అందుకే వైసీపీ వాళ్ళు కనిపిస్తే చాలు, ఇంటికి వెళ్ళే దాకా తరుముతున్నారు. గడపగడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు తరిమి తిరిమి కొడుతున్నారు. బస్సు యాత్ర తుస్సు మంది. జగన్ సభలకు కూడా ప్రజలు రావటం లేదు. దీంతో ప్రజల నిరసన సెగ తాడేపల్లి ప్యాలెస్ కు తగిలింది. ఎమ్మెల్యేలు కూడా ఈ దెబ్బతో ప్రజల వద్దకు వెళ్ళక పోవటంతో, జగన్ మోహన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. దీని పై నివేదిక తెప్పించుకున్న జగన్, ప్రజల నిరసన తెలుసుకుని, ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించి, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ కు తాకిన ప్రజల నిరసన సెగ... 175 మంది ఎమ్మెల్యేలను పిలిపించిన జగన్...
Advertisements