ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి సంరక్షణ కోసం ఎంతలా తపిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే... తాజాగా నదులు, చెరువులు, అన్నిటినీ పూజించాలి అంటూ, జలసిరికి హారతి అనే కార్యక్రమం కూడా మొదలు పెట్టారు.

జలసిరి కోసం, ప్రజలు అర్ధమయ్యే రీతిలో, పాటల రూపంలో కూడా కార్యక్రమాలు రూపొందించారు.. ఇందుకోసం, ప్రముఖ సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్‌ కు బాధ్యతలు అప్పగించారు. తాను రచించిన పాట ముఖ్యమంత్రికి వినిపించటానికి, ప్రముఖ నేపధ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తో కలిసి అమరావతి వచ్చారు.

అయితే, చంద్రబాబు బిజీ షెడ్యూల్‌ కారణంగా, కడప జిల్లా ప్రయాణానకి చంద్రబాబు బయలుదేరుతున్న ఫ్లైట్ లోనే, ఇద్దరినీ రమ్మన్నారు ముఖ్యమంత్రి. విజయవాడ నుంచి కడప వెళ్తున్న ఫ్లైట్ లో, ముఖ్యమంత్రితో కలిసి, అనంతశ్రీరామ్‌, వందేమాతరం శ్రీనివాస్ ప్రయాణిస్తూ, ఆ సమయంలోనే ముఖ్యమంత్రికి పాట పాడి వినిపించారు.

చంద్రబాబు పుణ్యమా అని కడప గడపలో కాలిడడం, ఇక్కడి గాలిని పీల్చడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

ప్రతి నీటిబొట్టు ప్రజల గొంతు తడపాలని, పైరుకు అందాలని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఆ ఆశయం, సంకల్పంలో భాగంగా ఈ పాట రచించామని రాష్ట్రం సస్యశ్యామలం కావడంలో తమకు భాగస్వామ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు అనంతశ్రీరామ్‌.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సకాలంలో జోక్యం చేసుకోవడంతో ఒక వ్యక్తి ఆత్మహత్య విరమించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు. కేశవరెడ్డి విద్యా సంస్థలలో 5 లక్షల పెట్టుబడి పెట్టారు శ్రీనివాస్ రెడ్డి. కాని కేశవరెడ్డి విద్యా సంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే..

అయితే ప్రస్తుతం తన పిల్లల గుండె జబ్బుల కోసం డబ్బులు లేక రోడ్డున పడ్డాడు శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి దగ్గర గోడు వినిపించుకోవడం కోసం అమరావతి వచ్చారు. అదే విషయం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కాని తనిఖీ చేస్తున్న సమయంలో అతని దగ్గర పురుగుల మందు డబ్బా చూసి వెనక్కి పంపేసారు సిబ్బంది.

దీంతో శ్రీనివాస్ రెడ్డి మీడియాతో తన గోడు చెప్పుకున్నారు. అనంతపురం టూర్ లో ఉన్న ముఖ్యమంత్రి, మీడియాలో చూసి, వెంటనే తన కార్యాలయానికి ఫోన్ చేసి, బాధితుడిని ఆదుకోవాలంటూ ఆదేశించారు. ముఖ్యమంత్రి స్పందనతో అధికారులతో శ్రీనివాస్ రెడ్డి విషయం చెప్పారు. ప్రభుత్వం అతని పిల్లలకు అవసరమైన చికిత్స చెయ్యటంతో పాటు, కేశవరెడ్డి విద్యా సంస్థలలో పెట్టిన డబ్బులు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తుంది.

ఒక వేళ చంద్రబాబు స్పందించకుండా ఉంటే, తను తెచ్చుకున్న పురుగులు మందు తాగి, ఆటను ఆత్మహత్య చేసుకునేవారు.. చంద్రబాబు సకలలంలో స్పందించటంతో, కుటుంబానికి పెద్ద దిక్కైన ఒక నిండు ప్రాణం నిలబడింది...

కేంద్రం నిధులు విడుదలలో అలసత్వం... కాంట్రాక్టు సంస్థ నిర్లిప్తత తోడై, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు సాగుతూనే ఉన్నాయి... చంద్రబాబు పరిపాలన దక్షతకు సవాల్ గా ఉన్న ఈ ఫ్లై ఓవర్, అటు ప్రభుత్వానికి, ఇటు చంద్రబాబు ఇమేజ్ కి కూడా చెడ్డ పేరు తీసుకువస్తుంది.. ఫ్లై ఓవర్ పనులు గురించి, ఇవాళ చంద్రబాబు సమీక్ష నిర్వహించారు...

కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటి కల్లా ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు గడువు విధించారు. శనివారం తన కార్యాలయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పనులు మందకొడిగా సాగిస్తూ నిర్మాణ సంస్థ ‘సోమా’ ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందిని పెంచి, ఇక నుంచి 24 గంటలు పగలు రాత్రి పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. పనులు ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.

కనకదుర్గ ఫ్లైఓవర్ పనులకు అంతరాయం కలుగకుండా, శరవేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు ఈనెల 11న ఉదయం 6 గంటల నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈనెల 20 నుంచి 30 వరకు మాత్రం నడకదారికి అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు.

రహదారి మూసివేసిన అన్ని రోజులు పాసుల పేరుతో ఏ ఒక్కరికీ ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యేవరకు రెండువైపులా శాశ్వత ప్రాతిపదికన బారికేడ్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు.

దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రహదారులపై రద్దీ నిర్వహణ సమర్ధంగా జరగాలని చెప్పారు. సితార జంక్షన్ దగ్గర రహదారికి విస్తరణ చేపట్టామని, ఇప్పటికే అవసరమైన మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కేఈ ప్రధాన కాలువ బంద్
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు, అలాగే 2018 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కేఈ ప్రధాన కాలువ ప్రవాహాన్ని నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. అటు దుర్గగుడి సమీపంలోని ఏపీ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

తండ్రిలా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు... మరి పిల్లలకి హాని చేస్తే ఊరుకుంటారా ? ఊరి కాని ఊరిలో చదవుకుంటానికి వెళ్ళిన పిల్లలను ఇబ్బంది పెడితే, బాగోదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు... మీకు నేనున్నా అంటూ, మన పిల్లకి భారోసా ఇచ్చారు...

కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో రైల్వే, బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకొని హాల్‌ టికెట్లు చించివేశారు. అంతేగాక, కొందరు తెలుగు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు. కన్నడిగుల తీరుతో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

విషయం తెలుసుకున్న చంద్రబాబు, కర్ణాటకలో తెలుగు విద్యార్ధులపై దాడి అంశంపై కర్ణాటక సీఎస్‌, డీజీపీ, కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడాలని సీఎం స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్రను ఆదేశించారు. అంతేగాక అవసరమైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. మా పిల్లల జోలికి రాకుండా చూడాలి అని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.

సెప్టెంబర్ 10, 16,17, 24 తేదీల్లో జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కర్ణాటకలో జాతీయ పోటీ పరీక్షలు రాసే తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read