తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నుంచి గట్టి ఎదురు దా-డి ఎదుర్కుంటుంది. బీజేపీ ఎక్కి దిగుతుంది. ఇన్నాళ్ళు చంద్రబాబు బూచిగా చూపి, రాజకీయం చేసిన కేసీఆర్ కు బీజేపీని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కావటం లేదు. ప్రజల్లో కూడా కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చేసింది. కేసీఆర్ ఏమి చెప్పినా వినే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకుని వచ్చి, కులాల వారీగా విడగొట్టి, గెలవాలి అనే ప్లాన్ లో ఉన్నారు. అందులో భాగంగానే, తెలంగాణాలో గణనీయంగా ఉన్న టిడిపి ఓట్ల పైన కేసీఆర్ కన్ను పడింది. 5% పైన ఓటింగ్ ఉన్న టిడిపిని మంచి చేసుకునే పనిలో టీఆర్ఎస్ పడింది. ఇందు కోసం ఎన్టీఆర్ ను ఉపయోగించుకున్నారు. ఎప్పుడూ లేనిది ఎన్టీఆర్ జయంతి రోజున, టీఆర్ఏ ఎమ్మెల్యేలు, మంత్రులు మామూలు ప్రేమ కురిపించ లేదు. అసలు కేసీఆర్ కూడా జయంతి ఉత్సవాలకు వస్తారని సమాచారం వచ్చినా, ఆయన చివరి నిమిషాలో డ్రాప్ అయ్యారు. ఒక పక్క ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూనే, మరో పక్క చంద్రబాబుని కూడా మంచి చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ లో గెలిచినా, టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. నిజానికి ఈయన జగన్ కు సన్నిహితుడు. అయినా కూడా ఎల్బీనగర్ లో ఉండే ఒక సామాజికవర్గ ఓట్ల కోసం, చంద్రబాబు నామస్మరణ చేస్తూ, చంద్రబాబు వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు తనను గెలిపించారు కాబట్టి, ఎన్టీఆర్ విగ్రహం పెడతానని ప్రకటించారు. టీఆర్ఎస్ లో వస్తున్న ఈ కొత్త ట్రెండ్, ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే అని తెలుస్తుంది. ఏపిలో ఏ కులాన్ని అయితే బూచిగా చూపించారో, తెలంగాణాలో ఆ కులం ఓట్ల కోసం, ఇదే ప్రశాంత్ కిషోర్ పాట్లు పడుతున్నారు.
ఉన్నట్టు ఉండి చంద్రబాబు నామస్మరణ చేస్తున్న టీఆర్ఎస్, లిస్టు లో మరో ఎమ్మెల్యే.. ఎందుకో మరి ?
Advertisements