రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మంచి వాతావరణం వచ్చింది. బాదుడే బాదుడు కార్యక్రమం, ఆలాగే మహానాడు కార్యక్రమాలతో, మంచి ఊపు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన ప్రజలు, టిడిపి వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కూడా స్పీడ్ పెంచారు. మరీ ముఖ్యంగా టిడిపి నేతలు కొంత మందికి వార్నింగ్ లు ఇస్తున్నారు. గ్రూపులు కట్టి పార్టీని నాశనం చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సర్వే రిపోర్ట్ లో వారి ముందే పెట్టి, సమాధానాలు కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వీరిని పార్టీ ఆఫీస్ కు పిలిపించటం కాకుండా, వారి వద్దకే వెళ్లి తేల్చేయాలని చంద్రబాబు సరి కొత్త వ్యూహం పన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఏడాది పాటు, మినీ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా, ఏడాది పాటు ప్రజల్లోనే ఉండాలని, నెలకు రెండు జిల్లాలు తిరగాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి చంద్రబాబు తదుపరి పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒక రోజు సభ, ఒక రోజు రోడ్ షో చేసి, మూడో రోజు మాత్రం ఆయా పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పై సమీక్ష చేయనున్నారు. అదే సమయంలో సర్వే రిపోర్ట్ లు చూపించి, నేతల పని తీరు పై సమీక్ష చేసి, తేడా ఉంటే అక్కడే వారిని పీకేసి, కొత్త ఇంచార్జ్ ను నియమించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read