వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ గ్రాఫ్ పడిపోతుందని గ్రహించి, రేపు ఒక కీలక సమావేశం తాడేపల్లిలో పెట్టుకుంది. మొత్తం పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను ఈ సమావేశానికి పిలిచారు. ప్రధానంగా మూడు అంశాల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బస్సు యాత్ర ఫెయిల్ అవ్వటం, గడపగడపకూ కార్యక్రమం ఫెయిల్ అవ్వటం, కొత్త సలహాదారుని పరిచయం చేయటం వంటి వాటి పై చర్చించనున్నారు. కేవలం 24 మంది మాత్రమే ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గున్నారని రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అసలు ఈ కార్యక్రమమే మొదలు పెట్టలేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించాలి అనేదాని పై చర్చించనున్నారు. ఇక దీంతో పాటు, ముఖ్యమైన విషయం, ప్రశాంత్ కిషోర్ ఇప్యాక్ నుంచి తప్పుకున్నానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్లేస్ లో, రిషీ రాజ్ సింగ్ అనే కొత్త వ్యక్తి, ఐప్యాక్ తరుపున, ఆయన రేపు వైసీపీ తరుపున చార్జ్ తీసుకుంటారని తెలుస్తుంది. రేపు పార్టీ మొత్తానికి, రిషీని జగన్ పరిచయం చేయనున్నారు. గతంలో ఈ రిషీ పెళ్లికి, జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ జగన్, ఆయన సతీమణి వెళ్లారు. పడిపోతున్న తమ గ్రాఫ్ ని, రిషీ చేతిలో జగన్ పెట్టి, రేపు పార్టీకి పరిచయం చేయనున్నారు.
ప్రశాంత్ కిషోర్ ప్లేస్ లో కొత్త సలహాదారు.. రేపు ఎమ్మెల్యేలకు పరిచయం చేయనున్న జగన్...
Advertisements