తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీ సమేతంగా ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి, అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబుని, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మ వారికి చంద్రబాబు దంపతులు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వాదం తరువాత, చంద్రబాబు మీడియా పాయింట్ లో, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ విలేఖరులు, కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన పార్టీ పై మీ స్పందన ఏంటి అంటూ, విలేఖరులు అడగగా, చంద్రబాబు ఒక నవ్వు నవ్వి, చేతులు చూపించి, నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇక అంతకు ముందు మరో విలేఖరి, ఇంతకు ముందే, మంత్రి రోజా ఇక్కడకు వచ్చి, అమ్మ వారికి 108 కొబ్బరికాయలు కొట్టి, మూడు రాజధానులు ఉండాలని కోరుకున్నారని చంద్రబాబుతో చెప్పగా, దానికి చంద్రబాబు స్పందించారు. అమరావతి రాజధానిగా ఉండాలని, గతంలో అన్ని పక్షాలు నిర్ణయం తీసుకున్నప్పుడు, రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు తెచ్చామని, అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తెచ్చి, అందరి దేవతల ఆశీర్వాదం తీసుకున్న విషయాన్ని గుర్తు చేసారు.

cbn kcr 05102022 2

గతంలో వైసీపీ వాళ్ళు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నారని, ఇక్కడే తాము ఇళ్లు కూడా కట్టుకుంటున్నామని చెప్పారని, ఇప్పుడు రోజుకి ఒక మాట మార్చుతూ, ప్రజలను మభ్య పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాంటి వారిని దుర్గమ్మ తల్లి కూడా సహించదని చంద్రబాబు అన్నారు. ఈ దసరా సందర్భంగా, దుర్గమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. భక్తులు అందరికీ దుర్గమ్మ కరుణాకటాక్షాలు లభించలాని ఆకాంక్షించారు. నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. 150 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఆ అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం ఆపేసిందని, అవన్నీ ఈ ప్రభుత్వం కొనసాగించాలి అని చంద్రబాబు అన్నారు. ఇక చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవినేని ఉమా, ఇతర నాయకులు కూడా ఉన్నారు. ప్రజలు చంద్రబాబుకు అభివాదం చేస్తూ కనిపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read