గురువారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా, విలేఖరులు, కేసీఆర్ పెట్టిన పార్టీ పై తమ అభిప్రాయం చెప్పాలని కోరారు. దీని పై అశోక్ బాబు స్పందించారు. ఆయన మాటల్లోనే, "నాకు అవకాసం ఉందని, రాష్ట్ర స్థాయి పార్టీని, జాతీయ స్థాయి పార్టీగా మారుస్తా అంటే, అది జాతీయ స్థాయి పార్టీ అవ్వదు. బహుసా కేసీఆర్ గారిని, ఏ రాష్ట్రమైన స్వాగాతిస్తుందేమో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి, ఈ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసి, ఈ రోజుకీ విభజన హామీలు అవ్వకుండా చేసి, ఆంధ్రప్రదేశ్ ని సెకండ్ గ్రేడ్ స్టేట్ అన్న కేసీఆర్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ గౌరవించరు. ఆయన స్వాతంత్ర్యం ఉంది కాబట్టి, భారత దేశంలో జాతీయ పార్టీగా మార్చుకున్నారేమో కానీ, ఆ జాతీయత అనేది, ఆయనలో లేదని, మన రాష్ట్రంలో జరిగిన పరిణామాల విషయంలోనే, మనం అర్ధం చేసుకోవచ్చు. వ్యాపారంలో టచ్ లో ఉండటం వేరు, రాజకీయంగా ప్రజలతో టచ్ లో ఉండటం వేరు. కుమారస్వామి, జేడీఎస్ పార్టీ, బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తా అని చెప్పారు కానీ, ఎక్కడా జేడీఎస్ ని, బీఆర్ఎస్ లో కలిసి వేస్తాం అని చెప్పలా. జాతీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన, అది జాతీయ పార్టీ అయిపోదు."
"కేసీఆర్ కి జాతీయవాదం ఉందో లేదో కానీ, నిజాయతీ అయితే లేదు. తెలంగాణా ఇస్తే, మీతో కలిపేస్తా అని కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి చెప్పారు, అలాగే దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ఇవన్నీ చూస్తే, ఆయనకు నిజయతీ ఎక్కడ ? ఆయన తెలంగాణా వాదం మీద బ్రతకగలరేమో కానీ, వేరే రకంగా మనుగడ ఉండదు. ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తుంటే, ఒక్కసారి కూడా అక్కడకు వెళ్ళలేదు. జాతీయ వాదం వేరు, జాతీయ పార్టీ వేరు." అని అశోక్ బాబు అన్నారు. ఇదే విషయం పై నిన్న టిడిపి అధినేత చంద్రబాబు ఇంద్రకీలాద్రి వచ్చిన సందర్భంలో, విలేఖరులు అడగగా, చంద్రబాబు సమాధానం చెప్పకుండా, నవ్వుతూ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు అధికార ప్రతినిధి హోదాలో, అశోక్ బాబు స్పందించారు. మరి తెలుగుదేశం పార్టీ స్పందన పై, టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతకు ముందు వైసీపీ తరుపున సజ్జల స్పందిస్తూ, తాము ఇతరుల గురించి మాట్లాడం అంటూ, తప్పించుకునే సమాధానం చెప్పారు.