నిన్న ఆంధ్రప్రదేశ్ లో పద్మావతి ట్రావెల్స్ బస్సులో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సులో నల్లజర్ల మండలం వీరవల్లి చెక్ పోస్ట్ దగ్గర 4.76 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. పద్మావతి ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సుల్లో భారీగా డబ్బుతో పాటుగా, బంగారం కూడా గుర్తించారు. స్సు లగేజ్ డిక్కీలలో, సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి డబ్బుని రవాణా చేస్తూ ఉండగా, పట్టుకున్నారు. ఒక్కో బాక్సులో రూ.80 లక్షల వరకు డబ్బు ఉంచి, అనేక బాక్సుల్లో తరలించారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వెళ్తున్న AP39 TB 7555 బస్సుతో పాటు, మరో బస్సులో ఈ డబ్బు పట్టుకున్నారు. అయితే దీని పై పోలీసులు నిన్నటి నుంచి విచారణ చేస్తున్నారు. ఈ డబ్బు మొత్తం విజయవాడకు చెందిన బంగారం వ్యాపారుల డబ్బు అని మొదటిగా భావించారు. అయితే ఇప్పటి వరకు ఈ డబ్బు మాది అంటూ ఎవరు రాకపోవటంతో, ఈ విషయంలో ట్విస్ట్ నెలకొంది. బంగారం వ్యాపారులు అయితే ఇప్పటి వరకు ఎందుకు రాకుండా ఉంటారు అనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే బస్సు డ్రైవర్ ని, క్లీనర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తం ఏడుగురుని అదుపులోకి తీసుకుని ఈ విషయం పై పోలీసులు విచారణ చేస్తున్నారు.

padmavati 02042022 2

అయితే వారి నుంచి కూడా సరైన సమాధానం రావటం లేదు. దీంతో ఎవరైనా వచ్చి ఈ డబ్బు తమదని చెప్తారని పోలీసులు భావిస్తున్నా, ఇప్పటి వరకు బంగారం వ్యాపారులు ఇది తమ డబ్బే అంటూ ఎవరూ రాకవపోవటంతో , ఇది పెద్ద మిస్టరీగా మారింది. ఈ డబ్బు మొత్తం ప్రస్తుతం ఏలూరు ట్రెజరీ ఆఫీస్ లో ఉంది. 4.76 కోట్ల నగదుతో పాటుగా, బంగారం కూడా ఉంది. ఇది మాది అని ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. అయితే ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో దొరికిన డబ్బు విషయంలో మాత్రం, ఆ డబ్బు తమదే అని వ్యాపారాలు వచ్చి, లెక్కలు చెప్తున్నారు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో దొరికిన డబ్బుకు మాత్రం, ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాకపోవటంతో, పోలీసులు కూడా ఈ విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాక్సులు ఎవరు బస్సులో పెట్టారు, ఈ బాక్సులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికీ అంద చేయమని ఆదేశాలు ఉన్నాయని, అనే అంశం పై స్పష్టత వస్తే, ఈ కేసు ఈజీగానే తేలిపోతుంది. మరి ఈ మిస్టరీ ఎప్పటికి తేలుతుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read