రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉగాది షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగుల వేతానాలకు మరో బ్రేక్ పడింది. ఇందులో ప్రధానంగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్లోడ్ చేసిన పేరోల్ బిల్లులు, రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్లోడ్ కాకపోవటంతో, సాంకేతిక సమస్య ఏర్పడింది. ఇప్పటికే ఆర్ధిక కష్టాలతో అల్లాడుతున్న ఏపి ఖజానాకి, ఇది ఒక ప్రతిబందకంగా మారింది. పెన్షన్ బిల్లులు అయితే ఎప్పటి లాగే, సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయగానే, అవి రిజర్వ్ బ్యాంక్ కు వెళ్ళిపోయాయి. పే స్లిప్పులు కూడా జెనరేట్ అయ్యాయి. అయితే డబ్బులు లేక పోవటంతో, ఈ నెల 4వ తేదీ వరకు ఆగల్సి ఉంది. ఇదే సమయంలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి, డ్రాయింగ్ అధికారులు, మొన్న నిన్న, పే బిల్స్ అన్నీ కూడా, సిఎఫ్ఎంఎస్ లో కాకుండా, పేరోల్ వెబ్ ద్వారా అప్లోడ్ చేసారు. వీటి అన్నిటినీ కూడా, ఫైనాన్స్ ఖజానా సిబ్బంది, రిజర్వ్ బ్యాంక్ కు అప్లోడ్ చేయాలని ప్రయత్నించగా, అవి అప్లోడ్ కాకుండా ఆగిపోయాయి. దీంతో, సాంకేతిక సమస్య వచ్చిందని తేలిపోయింది. దీంతో రాష్ట్ర అధికారులు, అన్ని జిల్లాల అధికారులు, ట్రజరీలకు, సబ్- ట్రజరీలు, డ్రాయింగ్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా తాజా ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ ఈ బిల్లులు అన్నీ కూడా, సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయాలని వాళ్ళు కోరారు.
ఈ బిల్లులుని తయారు చేయటం, వీటిని అప్లోడ్ చేయటం, ఇవన్నీ కూడా సాయంత్రం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే వరుసగా సెలవులు కావటం, ఉగాది, ఆదివారం కావటంతో, డ్రాయింగ్ ఆఫీసర్లు కానీ, ట్రజరీ సిబ్బంది, రాష్ట్ర సచివాలయం అధికారులు చాలా మంది సెలవు పెట్టి వెళ్ళిపోయారు. దీంతో నిన్న బిల్లులు అప్లోడ్ చేసే పరిస్థితి లేకపోవటంతో, ఈ బిల్లులు అన్నీ కూడా నిన్న రిజర్వ్ బ్యాంక్ కు పంపించటం ఆలస్యం అయ్యింది. దీంతో, 4వ తేదీ తరువాతే ఈ బిల్లులు అన్నీ కూడా అయ్యే అవకాసం ఉంది. మంగళవారం రిజ్వర్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బండ్లు వేలం వేసే అవకాసం ఉండటంతో, మంగళవారం తరువాతే జీతాలు పడే అవకాసం ఉంది. ఈ లోపు ఏమైనా డబ్బులు సమకూరితే కొంత మందికి జీతాలు ఇచ్చే అవకాసం ఉంది. మొత్తానికి ఇప్పటికే ఆర్ధిక కష్టాలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, సాంకేతిక అంశాలతో కూడా ఇబ్బందులు ఎదుర్కుంటూ, చివరకు పండుగ పూట కూడా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.