ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రబుత్వం చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనలు, న్యాయ వ్యవస్థలపై చేస్తున్న దా-డు-లు , వీటన్నిటికి సంబంధించి ప్రధాని మోడీకి ఎంపి రఘురామ కృష్ణం రాజు ఒక సుదీర్గమైన లేఖను రాసారు. అందులో భాగంగా ఏపిలో రాష్ట్రపతి పాలన విదించాల్సిన సమయం ఆసన్నమయిందని, ఏపిలో జరుగుతున్న రాజ్యంగా ఉల్లంఘనలపై కేంద్రం దృష్టి సారించాలని, అక్కడ పరిస్థితులను వెంటనే ఆరా తీయాలని, ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపిలో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయని వెంటనే రాష్ట్రపతి పాలన విదించాలని, దీని గురించి వెంటనే, రాష్ట్రపతి కోవింద్ కూడా ఆదేశాలు జారీ చేయాలని రఘురామ కృష్ణం రాజు లేఖలో విన్నవించారు. అంతే కాకుండా అమరావతి నిర్మాణం జరగాలని ఇటీవల హైకోర్ట్ ఇచ్చిన తీర్పు గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా రాజ్యంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ,ఇది న్యాయ వ్యవస్థను కించపరచడమే అవుతుందని , అసలు హైకోర్ట్ తీర్పు ఇచ్చిన తరువాత దాని గురించి మళ్ళి చర్చ జరపడం సరికాదని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. కావాలంటే వాళ్ళు మళ్ళీ ఈ తీర్పు గురించి పిటీషన్ దాఖలు చేసుకోవాలే కాని, అసెంబ్లీలో దీని గురించి చర్చించడం దారుణమని, న్యాయవ్యవస్థ పై దా-డి-కి ఇదే నిదర్శనమని ఆయన మోడీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.
అంతే కాకుండా అమరావతి నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్ట్ ఆదేశిస్తే, దీనికి విరుద్దంగా 60 నెలలు సమయం కోరడం అనేది ప్రబుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అడ్డం పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే కోర్ట్ లో ప్రభుత్వానికి 150 పైన కేసుల్లో చుక్కు ఎదురైందని , అంతకంటే ఎక్కువే కోర్ట్ దిక్కరణకేసులున్నాయని, అంతేకాకుండా ఏ రాష్ట్రంలో లేని విదంగా ఏపి లో 8 మంది IAS లకు కోర్ట్ దిక్కారణ కింద ఇటీవల శిక్ష కూడా విదించడం జరిగిందదని ఆయన చెప్పారు. దేశ చరిత్రలో లేని విధంగా ఒకేసారి ఎనిమిది మంది ఐఏఎస్ ల పైన, కోర్టు శిక్ష విధించిందని ఆ లేఖలో తెలిపారు. ఐఏఎస్, ఐపిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పెట్టారని ఆ లేఖలో తెలిపారు. ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ఏపి లో రాష్ట్రపతి పాలన విదించాలని రఘురాం కృష్ణం రాజు ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రేపు జగన్ ఢిల్లీ పర్యటన ఉన్న నేపధ్యంలో, ప్రధానిని జగన్ కలుస్తారు అన్న టైంలోనే, రఘురామరాజు లేఖ రాయటంతో, వైసీపీ ఉలిక్కి పడింది.