కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గానికి చట్టాలు వర్తించవా అని, ఆ నియోజకవర్గంలో తప్పొప్పులు నిర్ణయించేది ఎవరని, అసలు కొన్ని వ్యవస్థలు సదరు నియోజకవర్గంలో పని చేస్తున్నాయా లేదో..ముఖ్యమంత్రిగానీ, రాష్ట్ర స్థాయి అధికారగణమో సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యు లు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లో నే మీకోసం....! గుడివాడి నియోజకవర్గం ఏమైనా మంత్రి కొడాలి నానీ సొంతజాగీరా ? గుడివాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో, దేశంలో ఏమైనా ప్రత్యేక ప్రతిపత్తి ఉందా? కొడాలి నానీ చెప్పిందే ఆ నియోజకవర్గంలో వేదమా..అక్కడేమీ పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖలు ఏమీలేవా? నిన్నటికి నిన్న ఒకన్యూస్ ఛానల్లో ఒక కథనం ప్రసారమైంది. అడపా బాబ్జీ అనే వ్యక్తి కొడాలి నానీకి ముఖ్యమైన అనుచరుడు. అతను చనిపోతే చాలా వేళ్లు మంత్రి వైపే చూపించాయి. అతని మరణానికి మంత్రే కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు. అడపా బాబ్జీ శవ యాత్ర జరుగుతుండగా, మంత్రి వెళ్లి మృతదేహాన్ని చూసి వస్తుండగా, ఒక యువకుడు మంత్రిపై దా-డి చేసినంత పని చేశాడు. నీ వల్లే అడపాబాబ్జీ చనిపోయాడని సదరు యువకుడు మంత్రిని నిలదీస్తూ, నానీ చొక్కా పట్టుకున్నాడంటున్నారు. సదరు ఘటనపై ప్రభుత్వం విచారించదా? ప్రభుత్వానికి, వ్యవస్థలకు ఆ బాధ్యత లేదా? అడపా బాబ్జీ గుండెపోటుతో చనిపోయాడంటున్నారు. ఎవరి ఇబ్బందులు..ఎవరి ఒత్తిడివల్ల బాబ్జీకి గుండెపోటు వచ్చిందని అతని కుటుంబ సభ్యులను ఆరా తీశారా? న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాన్నిబట్టి, గుడివాడ ప్రజలు అనుకునే దాన్నిబట్టి, అడపా బాబ్జీ బావమరిదైన వంకా విజయ్ గతంలో మంత్రిగారి తరుపున 2014 ఎన్నికల్లో విపరీతంగా ఖర్చుపెట్టి, ఎన్నికల ప్రచారం చేశాడు. ఆ సమయంలో తాను గెలిచాక విజయ్ తన కోసం పెట్టిన ఖర్చంతా తిరిగి చెల్లిస్తానని మంత్రిగారు చెప్పారు. ఈమాట నేను అనడంలేదు.. గుడివాడ ప్రజలంతా అనుకుంటున్నారు. దానికి సాక్ష్యాలేమున్నాయో..అది నిజమోకాదో... విచారించాల్సిన బాధ్యత అధికారులదే కదా! ఏరుదాటేవరకు ఓడమల్లయ్య..ఏరు దాటాక బోడిమల్లయ్య అదేకదా.. మంత్రి కొడాలి నానీ వ్యవహార శైలి. "
"ఆయన నోటికి, బూతులకు భయపడి వ్యవస్థలు అన్నీకిమ్మనకుండా ఉండటం భావ్యమా? అడపా బాబ్జీ బావమరిదైన వంకా విజయ్ రైలు కింద పడి ఆత్మ-హ-త్య చేసుకున్నాడంటున్నారు. ఆ ఘటనను నాటి రైల్వే పోలీసులు ప్రమాదవశాత్తూ మరణించారని చెప్పాడు. ఆనాడు మరణించిన విజయ్ జేబులో సూసైడ్ నోట్ ఉందని, అది చేరాల్సినవారికి చేరలేదని, దానికి సంబంధించిన మరోకాపీ మాత్రం అడపా బాబ్జీకి చేరిందని గుడివాడ గగ్గోలుపెడు తోంది. వంకా విజయ్ సూసైడ్ నోట్ మాయమైతే, అతని మరణాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించడానికి స్వయంగా మంత్రిగారే రంగంలోకి దిగారంటున్నారు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు అడపా బాబ్జీని మంత్రిగారు పిలిపించి, విజయ్ రాసిన సూసైడ్ నోట్ వివరాలు బయట పెట్టవద్దని, విజయ్ తాలూకా బాకీ మొత్తాన్ని తీరుస్తానని మరలా బాబ్జీతో నమ్మ బలికాడు. కానీ మంత్రిగారు తన ప్రామిస్ ను నిలబెట్టుకోలేదు. బాబ్జీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తానని.. అప్పులన్నీతీరుస్తానని చెప్పిన మంత్రి గారు అవేవీచేయలేదు. దాంతో బాబ్జీ పరిస్థితి హృదయవిదారకంగా తయారైంది. దాంతో అతను మనస్తాపానికిగురై భరించలేని ఒత్తిడి తోనే గుండెపోటుకి గురయ్యాడంటున్నారు. అడపాబాబ్జీ బావమరిది వంకా విజయ్ మృతిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని.... అతని కుటుంబసభ్యులను, సన్నిహితులను విచారించి వాస్తవాలు వెల్లడించాలని కోరబోతున్నాను. విజయ్ మృతిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రకరించింది ఎవరు...దాని వెనకాల మంత్రిగారి ప్రమేయముందా అనే దానిపై కూడా ఆరా తీయాలని డీజీపీని కోరబోతున్నాం. అలానే బాబ్జీ శవ యాత్రలో మంత్రిపై యువకుడు దా-డి చేయడానికి కారణమేంటి.. బాబ్జీకి ఎందుకు గుండెపోటు వచ్చింది.. గుండెపోటుతో అతను చని పోయేంతలా అతన్ని ఒత్తిడికి గురిచేసింది ఎవరనేదానిపై కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డీజీపీని కోరాలని నిర్ణయించుకున్నాం." అని వర్ల రామయ్య అన్నారు.