మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు పై, జగన్ మార్క్ కక్ష సాధింపు ఎలా ఉంటుందో చూస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పై సస్పెన్షన్ వేటు వేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. విచారణ ఏమైందో తెలియదు, ఎక్కడ వరకు వచ్చిందో తెలియదు. మరో పక్క కోర్టులో కేసు కూడా విచారణకు రావటం లేదు. ఈ నేపధ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది. ఆయన చీఫ్ సెక్రటరీ లేఖ రాస్తూ, ఫిబ్రవరి 8కి తనని సస్పెండ్ చేసి రెండేళ్ళు అయిపోయింది కాబట్టి, నిబంధనలు ప్రకారం, తన పై విధించిన సస్పెన్షన్ దానంతట అదే తొలగిపోయినట్టే అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం, రెండేళ్ళ లోపు ఆయన పైన మోపిన అభియోగాల పై విచారణ చేయాలి. విచారణలో తేలిన అంశాలను బట్టి, ఆ అధికారి పై చర్యలు తెసుకోవాల్సి ఉంటుంది. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో, ఇప్పటికే రెండేళ్ళు అయిపోయినా, ఇప్పటి వరకు ఏమి జరగలేదు. రెండేళ్ళు దాటిపోయింది కాబట్టి, ఇప్పుడు ఇది కేంద్రం కోర్ట్ లోకి వెళ్తుంది.
ఈ సస్పెన్షన్ రెండేళ్ళు దాటి కొనసాగాలి అంటే, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సమీక్ష కమిటీ సిఫార్సు చేస్తేనే ఇది కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆ కమిటీ ఎలానటి సిఫారుసు కానీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగించింది. అది ఫిబ్రవరి 8తో ముగిసింది. రెండేళ్ళు దాటిపోవటం, అలాగే కేంద్రం కూడా ఎలాంటి సిఫార్సు చేయక పోవటంతో, ఆయన సస్పెన్షన్ పూర్తయినట్టే. ఆ రోజు నుంచి కూడా ఆయనకు పూర్తి జీతం పొందే అవకాసం ఉంది. ఇదే విషయం పైన ఏబీ వెంకటేశ్వరరావు, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. జగన్ మోహన్ రెడ్డి, ఏబీ వెంకటేశ్వరరావు ఎలా కక్ష కట్టారో తెలిసిందే. గత వారం కూడా అయన పై పెగాసిస్ ఆరోపణలు కూడా చేసారు. అయితే ఆ ఆరోపణల పై వెంటనే ఆయన సమాధానం కూడా చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో అనేక సంచలన అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు మళ్ళీ లేఖ రాసి, జగన్ మోహన్ రెడ్డిని, ఏబీ వెంకటేశ్వరరావు చాలెంజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నిబంధనలు ప్రకారం వెళ్తారో, జగన్ ఏమి చేస్తారో చూడాలి.