ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి, జస్ట్ టికెట్స్ అనే సంస్థతో పాటుగా, దుబాయ్ కి చెందిన మరో సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా టెండర్లు వేసాయి. ఈ రెండిట్లో జస్ట్ టికెట్స్ టెండర్ దాదాపుగా ఖరారు అయినట్టు వార్తలు వస్తున్నాయి. టెండర్లు ఖరారు చేసినప్పటికీ ప్రభుత్వం ఈ జస్ట్ టికెట్స్ మధ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. త్వరలోనే ఇది జరిగే అవకాసం ఉంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ అంటూ ప్రభుత్వం చెప్తున్నట్టు ఇప్పుడే ఇది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే, ఇందులో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే షో పడలేదో, ఆ పడని షోకి డబ్బులు రిటర్న్ చేయటం దగ్గర ఎలా అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. అయితే జస్ట్ టికెట్స్, అల్లు కుటుంబానికి సంబంధించింది. అల్లు అరవింద్ కుటుంబంతో పాటు, మరో సంస్థ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ రెండు సంస్థలు కూడా కలిపి, ఈ జస్ట్ టికెట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసారు. ఇప్పటికే జస్ట్ టికెట్స్ అనే ఆన్లైన్ వెబ్ సైట్, అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ లో ఉంది. జస్ట్ టికెట్స్ తో పాటుగా, బుక్ మై షో, ఇప్పటికే ఆన్లైన్ లో పలు ధియేటర్లతో ఒప్పందం కుదుర్చుకుని, ఆన్లైన్ టికెట్ల జారీ చేస్తున్నాయి.
అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఏపి ప్రభుత్వమే నేరుగా ఆన్లైన్ లో సినిమా టికెట్లు అమ్ముతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ ఒకటి నుంచి, మొదలు అయ్యే ఈ ప్రక్రియలో, జస్ట్ టికెట్స్ సంస్థకు ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరిందని, జస్ట్ టికెట్స్ ఆన్లైన్ టికెట్లు జారీ చేస్తుందని చెప్తున్నా కూడా, ఒకటో తేదీ నుంచి సాంకేతిక పరమైన ఇబ్బందులు కారణంగా, ఒకటో తేదీ నుంచి ఇది సాధ్యం కాదని చెప్తున్నారు. మరో ముఖ్యమైన అంశం, అర్ధరాత్రి 12 గంటలు తరువాత, ధియేటర్లకు ఆ రోజు వచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్న ఈ సందర్భంలో, సెకండ్ షో రద్దు అయితే, ఆ డబ్బులు రిటర్న్ చేయటం, అప్పటి వరకు వచ్చిన మూడు షోల డబ్బులు మాత్రమే ఇవ్వటం, ఇక్కడే సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి అని అంటున్నారు. అల్లు అరవింద్ కుటుంబం ఈ టెండర్ దాదపుగా దక్కించుకోవటం వెనుక, జగన్ తో సన్నిహితింగా ఉండే చిరంజీవి హస్తం కూడా ఏమైనా ఉందా అనే ప్రచారం జరుగుతున్నా, ఇదంతా టెండర్ల ప్రక్రియ ద్వారానే జరిగిందని ప్రభుత్వం చెప్తుంది.