2014లో హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, స్థానిక పోలీసులు జగన్ పై కేసు నమోదు చేసారు. దీని పైన ఇప్పటికే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా, జగన మోహన్ రెడ్డి, తమ ముందు హాజరు కావాలి అంటూ, నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా జగన్ విచారణకు హాజరు కావాలని వారం రోజులు క్రితం నోటీసులు ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లు తమకు అందలేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఎగ్గొట్టారు. దీని పై స్పందించిన నాంపల్లి కోర్టు, వెంటనే జగన్ కు సమన్లు ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి రెండు రోజుల క్రిందట సమన్లు అందాయి. అయితే దీని పైన జగన్ మోహన్ రెడ్డి, ఆ సమన్లు అందుకున్న వెంటనే, తెలంగాణా పిటీషన్ కు వెళ్ళారు. తెలంగాణా పిటీషన్ లో, ఈ కేసు పైన క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, 2014లో తన పైన నమోదు అయిన కేసుని కొట్టి వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంటే, దాదాపుగా ఎనిమిది ఏళ్ళ పాటు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కొట్టేయాలని కోర్టుకు వెళ్ళలేదో తెలియదు.
దాదాపుగా ఎనిమిది ఏళ్ళ తరువాత, జగన్ తన కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారు. జగన్ వేసిన పిటీషన్ పై, తెలంగాణా హైకోర్టు వెంటనే విచారణ చేసింది. నిన్న హుజూర్ నగర్ పోలీసులకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. అలాగే జగన్ మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసిన అంశం పై కూడా విచారణ చేసింది. ఈ కేసు నుండి, తొలగించాలని జగన్ పిటీషన్ లో అభ్యర్దించటంతో, హుజూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు ఇస్తూ, ఏప్రిల్ 20 లోపు ఈ అంశం పై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని, ఆధారాలు అన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి, ఏప్రిల్ 26 వరకు కూడా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అంటూ, తెలంగాణా హైకోర్టు స్టే ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి తమ ముందు హాజరు కావాలి అంటూ, నాంపల్లి కోర్టు, రెండో సారి కూడా సమన్లు జారీ చేయటంతో, జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అందరినీ స్టేలు అని ఎగతాళి చేసే జగన్, స్టే తెచ్చుకుని, కోర్టు హాజరు తప్పించుకున్నారు.