ఈ రాష్ట్రంలో కొంత మందిని చూసాం.. ఎబ్బే ఈ చంద్రబాబుకి ఇంగ్లీష్ మాట్లాడం రాదు అంటూ ఉంటారు.. ఇంకొకడు, నీ మొఖం చూసి ఎవడూ పెట్టుబడులు పెట్టరు అంటాడు... ఇంకొకడు, మాకు ఇవి ఏమి వద్దు, మేము ఏమి చెప్తే మాకు అదే కావలి అంటాడు... కాని, మన ముఖ్యమంత్రి వీళ్ళ లాగా కాదు... వీల్లందరికీ ఆయన పనితనం తోనే సమాధానం చెప్తారు...
అలాంటి ఘటనే ఇవాళ, వైజాగ్ CII సమ్మిట్ లో జరిగింది... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి అంటూ, 40 దేశాల ప్రతినిధుల కి, 1000 మంది డెలిగేట్స్ కి రాష్ట్రం గురించి గంట సేపు ప్రెసెంటేషన్ ఇచ్చారు.. తనలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్, మార్కెటింగ్ స్కిల్ల్స్ అన్నీ బయటకి తీసారు... గతం విశ్లేషించారు, జరుగుతున్నది క్లియర్ గా చెప్పారు, ఆయన విజిన్ ఏంటో, భవిషత్తు ఏంటో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు పెట్టుబడి పట్టాలి అనేది, కళ్ళకు కట్టినట్టు అక్కడ చెప్పారు...
క్రికెట్ లో, సచిన్ ఫార్మ్ లో ఉంటే ఎలా రేచ్చిపోతాడో, అలా ఆయనలో ఉన్న మార్కెటింగ్ గురు బయటకి వచ్చాడు... అక్కడ ఉన్న పెట్టుబడిదారులను ఉద్దేశిస్తూ... మీరు మా అమరావతి రండి, మా రాష్ట్రం రండి.. జరుగుతున్నది చూడండి... పెట్టుబడులు పెట్టండి... మీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాను... 24/7 పవర్, వాటర్... పవర్ సెక్టార్ లో మమ్ముల్ని కొట్టినోడు లేడు... ప్రతి ఇంటింకి ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ ఇస్తున్నాం... ప్రతి ఇంటిని ఒక నాలెడ్జి ప్లేస్ గా తీర్చిదిద్దుతున్నాం... మాకు సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు... వ్యవసాయం,పారిశ్రామికం రెండు బాలన్స్ చేస్తున్నాం... ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము టాప్... ఇవన్నీ నేను చెప్పటం కాదు, మా గ్రోత్ రేట్ చూడండి... డబల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉన్న ఏకైక రాష్ట్రం మాది.... వచ్చే సంవత్సరం కూడా మేము డబల్ డిజిట్ గ్రోత్ సాధిస్తాం... మేము పోటీ పడేది ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్కడ ఉన్నా వాటితో... అమరావతి ని వరల్డ్ టాప్ 10 సిటీస్ లో ఉంచటమే నా ధ్యేయం... నేను తప్పకుండా అది సాధించి తీరుతా, అని ముగిస్తూ, మీకు నా ప్రెసెంటేషన్ నచ్చిందా, అని అనగానే, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది.... ఇంతలో స్టేజి మీద ఉన్న, ఒక డెలిగేట్, ఇలా కాదు, మన అందరం, స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి అనగానే, అక్కడ ఉన్న 40 దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, మీడియా, రాజకీయ నాయకులు...హ్యుజ్ అప్లాస్... ఆపకుండా క్లాప్స్ కొట్టారు... స్టాండింగ్ ఒవేషన్ తో క్లాప్స్ కొడుతూ చంద్రబాబుని అభినందించారు.
ఒక నాయకుడి నాయకత్వ లక్షణాలు బయట పడేది ఇలాంటి సందర్భాల్లోనే కదా.... ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఉండటం ఎంతో గర్వకారణం అని టీవీల ముందు కూర్చున్న ప్రజలు, ప్రశంసించారు.... మీరు చూడండి, ఈ వీడియో...