ఎన్నికల వ్యూహ కర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ కొత్త రాజికీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారంటూ ఆయన స్వయంగా ట్వీట్ చేయటంతో, మీడియాలో ఈ రోజు ఈ వార్త హైలైట్ అయ్యింది. బెంగాల్ లో జరిగిన ఎలక్షన్స్ తరువాత ఆయన ప్రత్యక్ష రాజీకీయాల వైపు అడుగులు వేస్తున్నట్టు, ఆయన అడుగులు చూస్తే అర్ధమైంది. ప్రశాంత్ కిషోర్ తన రాజీకీయ భవిషత్తు పై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఈ రోజు వేసిన ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. ఈ రోజు ట్విట్టర్ లో ప్రశాంత్ కోషోర్ తన రాజకీయ పార్టీ గురించి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా, ఆయన స్పందిస్తూ, తన సొంత రాష్ట్ర మైన బిహార్ నుంచే తన ప్రత్యక్ష రాజకీయాలను మొదలు పెడుతున్నట్టు చెప్పారు. నిన్నే ఆయన పాట్నా కు చేరుకొని పార్టీ ఏర్పాట్లు పై ఆలోచనలు చేస్తున్నట్టు లీకులు ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేయటమే హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లోనే చేరతారు అనే వార్తలు వచ్చినప్పటికీ , ఉన్నట్టుండి పీకే తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారో అనే విషయం పై మాత్రం స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా పీకే తమ పార్టీలోనే చేరతారని ప్రచారం చేసుకున్నారు.
పీకే సోనియాతో సుదీర్గమైన చర్చలు కూడా జరిపారు. పీకే సలహాలు , సూచనలతో ఇక కాంగ్రెస్ పార్టీ ఊపు అందుకుంటుందని అందరూ భావించారు. కాని ఇంతలోనే పీకే కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ లో ఎందుకు చేరడం లేదో అనే విషయాలు బయటకు రాలేదు గాని, వారు జరిపిన చర్చల్లో కొన్ని విషయాల పై ఏకాభిప్రాయం కుదరలేదని అందుకే కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని సమాచారం. అయితే మరో వైపు పీకే కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్న సమయంలోనే , హైదరాబాద్ లో కెసిఆర్ ని కలవడం పై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. పీకే కాంగ్రెస్ లో చేరక పోవడం వెనుక కేసిఆర్ తో భేటి కూడ ఒక కారణమా అనే అనుమానాలు వస్తున్నాయి . ఏదేమైనా ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాలు చేసిన ప్రశాంత కిషోర్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు వైపు అడుగులువేయడం సంచలనంగా మారింది. ప్రశాంత్ కిషోర్ చేసే విన్యాసాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ఆయన చేసే విధ్వంసకర రాజకీయాలు, ఇప్పుడు దేశ వ్యాప్తం కానున్నాయి..