విజయసాయి రెడ్డి ఏం చెప్పారో , ఏం చేసారో తెలియదు గాని ఒక్క రోజులోనే విజయ సాయి రెడ్డికి, జగన్ అత్యంత కీలక పదవి ఇచ్చి, అందలం ఎక్కించారు. నిన్నమొన్నటి దాక వైసిపి పార్టీలో విజయ సాయి రెడ్డి పని అయిపోయిందని, జగన్ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారని, వార్తలొచ్చిన నేపద్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రజలకే కాక , వారి సొంత పార్టీలో వారికి కూడా అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఏకంగా సజ్జలకు ఉన్న అధికారాలనే కొట్టేసారు. నిన్నటి వరకు పార్టీ పై పూర్తి పట్టు సజ్జలకే ఉండేది. అంటే, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఇలా అన్ని బాధ్యతలు, ఇపుడు ఆ వ్యవహారాలు కొన్ని విజయ సాయి రెడ్డి గ్రిప్ లోకి వచ్చేసాయి. విజయ సాయి రెడ్డి కి అసలు పార్టీలో నే స్థానం ఉండదని , జగన్ కి అతని పై నమ్మకం పోయిందని అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఒక్క రాత్రిలోనే సీన్ అంతా మారిపోయింది. పార్టీ పై పూర్తి పట్టు విజయసాయి రెడ్డికే దక్కింది. దీని వెనక ఉన్న కథ ఏమిటో వైసిపి నేతలకే అర్ధం కావట్లేదు. అయితే జగన్ ఆక్రమస్తుల గుట్టు అంతా విజయసాయి రెడ్డి కి తెలుసనీ, ఒక వేళ ఆయనను పక్కన పెడితే అప్రూవర్ మారతనని జగన్ను బెదిరించి ఉంటాడని , అందుకే రాత్రికి రాత్రే ఆయనకు పదవులు ఇచ్చి నోరు మూపించారని టిడిపి నేతలు వాపోతున్నారు.
రాత్రికి రాత్రి విజయసాయి సీన్ మారిపోయింది.. బెదిరించారా ?
Advertisements