వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని, విశాఖపట్నం బాధ్యతల నుంచి తొలగిస్తూ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత రాత్రి విడుదల చేసిన పార్టీ ఇంచార్జ్ ల జాబితాలో, విజయసాయి రెడ్డి పేరు విశాఖ నుంచి తొలగించినట్టు అర్ధం అవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయి రెడ్డి పై, భూ ఆక్రమణలకు సంబంధించి, పలు ఆరోపణలు, అదే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని పార్టీ నేతల నుంచి ఆరోపణలు రావటం, దీని పైన పలు సార్లు పంచాయతీలు జరగిన నేపధ్యంలోనే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది. విజయసాయి రెడ్డిని, ఆ బాధ్యతలు నుంచి తొలగిస్తూ, జగన్ బాబాయ్ వైవీ సుబ్బా రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. పార్టీ సమన్వయకర్తలు, ఇంచార్జ్ లను సమీక్షించే బాధ్యతలు ఇచ్చారు. అంటే పార్టీ మొత్తాన్ని ఇక సజ్జల నడపనున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం అందరికీ ఏదో ఒక జిల్లా ఇంచార్జ్ ఇచ్చిన జగన్, విజయసాయి రెడ్డికి మాత్రం ఒక్క జిల్లా కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కేవలం పార్టీ అనుబంధ సంఘాలను సమీక్షించే బాధ్యత ఒక్కటే ఇప్పుడు విజయసాయి రెడ్డి పైన ఉంది.
ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఒక నెల రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు ఆయనకు రెన్యువల్ అయ్యింది కాబట్టి, ఇక విజయసాయి రెడ్డికి మూడో సారి రాజ్యసభ రెన్యువల్ చేసే అవకాసం లేదని తెలుస్తుంది. దీంతో ఇక విజయసాయి రెడ్డి కేవలం తాడేపల్లి కేంద్రంగానే పని చేసే అవకాసం ఉంది. ఇక నియామకాల్లో విజయసాయి రెడ్డిని పీకేసినా, మిగతా అందరికీ ప్రాముఖ్యత పెంచారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి ఎక్కువ బాధ్యతలు అప్పగించారు. వీరి ఇద్దరికే, 62 నియోజకవర్గాలు అప్పచెప్పటంతో, ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధం అవుతుంది. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి చేతిలో పార్టీ మొత్తం ఆయన చేతిలోనే ఉంది. వైవీ సుబ్బారెడ్డికి అటు టిటిడితో పాటు, జిల్లాలు ఇచ్చారు. విజయసాయి రెడ్డికి మాత్రమే మొత్తం కట్ చేసేసారు. విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గిపోవటంతో, మొన్న జరిగిన తిరుపతి పర్యటనలో కూడా ఎవరూ ఆయన్ను కలవలేదు. కేవలం సోషల్ మీడియాతోనే విజయసాయి రెడ్డి నెట్టుకుని వస్తున్నారు.