తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అధికార పక్షం పైనే కాదు, సొంత పార్టీలో పని చేయని నాయకుల పైన కూడా దూకుడు పెంచారు. పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని, షో చేసే నాయకులకు పార్టీలో చోటు లేదని తేల్చి చెప్పారు చంద్రబాబు. సీనియర్ నేతలు అంటూ తప్పించుకుంటే కుదరదని చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో పని చేయకుండా, అంతా చేసేసినట్టు బిల్డ్ అప్ ఇచ్చే వారి తోకలు కత్తిరిస్తా అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కింద స్థాయిలో పని చేయకుండా, పార్టీ కార్లయం చుట్టూ కొంత మంది తిరుగుతున్నారని, అలా చేస్తే తన దగ్గర కుదరదని అన్నారు. సీనియారిటీ గౌరవిస్తాం అని, కానీ సీనియర్లు అని చెప్పుకుంటూ ఓట్లు వేయించలేని పరిస్థితిలో ఉంటే, అలంటి సీనియర్లు ఎందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలా ఓట్లు వేయించలేని సీనియర్లను నెత్తిన పెట్టుకుంటే, వారి వల్ల ప్రతిపక్షంలోనే ఉండి పోతాం అని చంద్రబాబు అన్నారు. 40% సీట్లు ఈ సారి యువతకు ఇస్తాన్నాం అని, తతస్తులకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. మొత్తానికి చంద్రబాబు ఇలా సీనియర్లకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వటంతో, సీనియర్ నేతలు ఉలిక్కి పడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read