రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, కోర్టు ఆగ్రహం తెప్పించిన విషయాలు ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు ఏకంగా కోర్టుకు సంబంధించిన అంశం పైనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడింది. డిప్యూటేషన్ పైన హైకోర్టులో పనిచేస్తున్న కొంత మంది సిబ్బందిని, GADకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను GADకి  ఇవ్వటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు సిబ్బందిని, హైకోర్టుకు చెప్పకుండా, హైకోర్ట్ అనుమతి లేకుండా ఎలా తప్పిస్తారు అంటూ, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల పై స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు పై స్టే ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read