సీనియర్ ఐఏఏ ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష తీర్చుకున్న విషయం తెలిసిందే. అయితే హైకోర్టుకు వెళ్ళిన సీనియర్ ఐఏఏ ఏబీ వెంకటేశ్వరరావు, అక్కడ కేసు గెలిచారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, హైకోర్ట్ తీర్పు పై అపీల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఈ కేసు చాలా రోజులుగా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఈ పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ కేసులో జరుగుతున్న విషయాల పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పైన సస్పెన్షన్ ఎంత కాలం కొనసాగిస్తారు అంటూ, సుప్రీం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్ళకు మించి సస్పెన్షన్ ఉండదు అనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి కదా అని ప్రశ్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తగియా ఆదేశాల కోసం తాము చూస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రెండేళ్ళ తరువాత, ఇప్పుడు కేంద్రాన్ని కోరటం ఏమిటి అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి లోగా తమ ముందు పూర్తి వివరాలు ఉంచాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ళ తరువాత కూడా ఎలా సస్పెన్షన్ కొనసాగిస్తున్నారో, తమకు ఆధారాలు చూపించాలని, రేపటికి ఈ కేసుని వాయిదా వేసింది.
సీనియర్ ఐఏఏ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో, జగన్ ప్రభుత్వానికి, సుప్రీం షాక్..
Advertisements