వైసిపి పార్టీ ఉత్తరాంద్రాకు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి ని జగన్ పూర్తిగా పక్కకు పెట్టాలనుకుంటున్నారా , అనే ప్రశ్నకు అవును అనే సమాధానమే పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే రాయలసీమను పెద్దిరెడ్డి, ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లా వైవీ సుబ్బారెడ్డి, కోస్తా జిల్లాలను సజ్జల , వీరందరూ ఆయా జిల్లా వ్యవహారాలన్నీ చూసుకునే వారు. కాని జగన్ మోహన్ రెడ్డి అందర్నీ మార్చబోతున్నట్టు సమాచారం. దీని కోసం జిల్లాల ఇంచార్జ్ ల కోసం కొత్త లిస్టు జగన్ ఇప్పటికే తయారు చేసినట్టు సమాచారం. అయితే ఈ లిస్టులో జగన్ మోహన్ రెడ్డి కి కుడిచెయ్యి అని చెప్పుకునే విజయసాయి రెడ్డి పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ జిల్లాల ఇంచార్జ్ ల విషయంలో విజయసాయి రెడ్డిని, జగన్ పూర్తిగా పక్కకు తప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ పీకే టీం ద్వారా విజయసాయి రెడ్డి పై సర్వే కూడా చేయించారని తెలుస్తుంది. ఆ సర్వే ద్వారా ఉత్తరాంద్రలో విజయసాయి రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నారని , అందుకే ఆయన్ని ఈ పదవి నుంచి తొలగించాలని ఉద్దేశంతో జగన్ ఉన్నట్లుగా సమాచారం. విజయసాయి రెడ్డిని పక్కన పెడితేనే మంచిదనే అభిప్రాయం తో జగన్ ఉన్నట్టు సమాచారం.
అయితే నిన్న గాక మొన్న విజయ సాయి రెడ్డి జాబు మేళాలు పెట్టిన సంగతి తెలిసిందే . ఇది జగన్ కు ఇష్టం లేదని చెప్పినా వినకుండా విజయసాయి రెడ్డి మాత్రం ఈ విషయం లో చాలా మొండిగా వ్యవహరించినట్లు సమాచారం. ఎక్కడా జగన్ కు మైలేజ్ ఇవ్వకుండా, ఈ కార్యక్రమం మొత్తం తానే చేస్తున్నట్టు విజయసాయి రెడ్డి బిల్ ఇచ్చారు. ఇవన్నీ మనసులో ఉంచుకొనే జగన్ కీలక భాద్యతల విషయంలో విజయ సాయి రెడ్డిని పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు ఆయనకు రాజ్యసభ సీటు రెన్యూవల్ కూడా చేయాల్సి ఉంది. ఈ విషయం పై జగన్ ఏమి చేస్తారో చూడాలని పార్టీ వర్గాలు చర్చిన్చుకుంటున్నాయి . ఒకవేళ రాజ్యసభ సీటు కూడా రెన్యువల్ చేయక పోతే, ఇక విజయ సాయి రెడ్డి పని క్లోజ్ అయిపోయినట్టే అనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద నెంబర్ టు స్థానం నుంచి, కొన్ని జిల్లాలకు పరిమితం అయ్యి, ఇప్పుడు మొత్తం దుకాణం సర్దేసే పరిస్థితి విజయసాయి రెడ్డికి వచ్చింది.