నిన్న ఒక పక్క కొత్త మంత్రి వర్గం వచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక పరుగులు పెడతాం అని అంటుంటే, అందరూ అభివృద్ధిలో అనుకున్నారు. తీరా చూస్తే, ప్రభుత్వం అప్పల్లో పరగులు పెడుతుంది. ఈ ఆర్ధిక ఏడాది మొదటి నెలలోనే, అప్పుల కుమ్ముడు మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ, అడ్డగోలు అండతో ఏపి ప్రభుత్వం అప్పుల్లో చెలరేగిపోతుంది. కొత్త మంత్రి వర్గం ఏర్పాటు అయిన రోజే, ఆర్బిఐ దగ్గరకు వెళ్లి రూ.2000 కోట్ల అప్పు తెచ్చుకుంది జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిన్న ఆర్బిఐ దగ్గర 7.52 శాతం వడ్డీకి రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. రూ.1000 కోట్ల అప్పు 20 ఏళ్లలో తీర్చాలి, మరో రూ.1,000 కోట్ల అప్పు 16 ఏళ్లలో తీర్చాల్సి ఉంటుంది. ఈ నెలలో ఇప్పటికే ఏప్రిల్ 5వ తేదీన రూ.2,000 కోట్ల అప్పు తెచ్చారు. అంటే ఆర్ధిక సంవత్సరం మొదటి 11 రోజుల్లోనే రూ.4,000 కోట్ల అప్పు తెచ్చి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఈ నెలలో ఇప్పటి వరకు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోలేదు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ రాష్ట్రానికి అప్పు తీసుకోవటానికి అనుమతి ఇవ్వలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం, గత ఏడాది లెక్కలు చెప్పి, రూ.4,238 కోట్ల వరకు ఈ ఏడాది అప్పు తీసుకోవచ్చు అంటూ, నిబంధనలు మార్చి మరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు తీసుకోవటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పర్మిషన్ లేకపోతేనే చెలరేగిపోయే జగన్ ప్రభుత్వం, కేంద్రం పర్మిషన్ ఇస్తే, ఇంకా ఎందుకు ఆగుతుంది ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read