పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లేయలేదన్న అక్కసుతో, ప్రభుత్వం అనేకగ్రామాల్లో పింఛన్లు కట్ చేయడం, తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటిచర్యలకు పాల్పడుతోందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమపార్టీ అధికారంలో ఉందికదాని ఇటువంటి దుర్మార్గపుచర్యలతో అనేకప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు రాక్షసానందం పొందుతున్నాయన్నారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలోని అచ్చంపల్లి-చెన్నపల్లిలో 45, కొట్టగూడెంమండలంలోని కొండారెడ్డిపల్లెలో 25మందికి పింఛన్లు తొలగించారని రాజు తెలిపారు. గుంటూరుజిల్లాలోని అనేకగ్రామాల్లో ఇప్పటికే 150మందికి పింఛన్లు నిలిపివేశారని, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలుసహా, అనేకజిల్లాల్లో అధికారులు మూకుమ్మడిగా వైసీపీ నేతల ప్రాబల్యంకోసం పనిచేస్తూ, అర్హులైనవారికి అన్యాయం చేస్తున్నారని రాజు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోట ములను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాల్సిన పాలకులు ఈ విధంగా చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సొంత బాబాయిని ఖూనీచేసినంత తేలిగ్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. తిరుపతి వెళ్లకుండా చంద్రబాబునాయుడిని అడ్డుకోవడంద్వారా జగన్మోహన్ రెడ్డి చరిత్ర లో ఎవరూచేయని తప్పు చేశాడన్నారు. చిత్తూరుజిల్లాను సామం తరాజ్యంగా మార్చుకున్న మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగ నూరు వీరప్పన్ లా వ్యవహరిస్తున్నాడని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు, పోలీసులసాయంతో మున్సిపల్ ఎన్నికల్లో టీ డీపీవారు నామినేషన్లు వేయకుండా పెద్దిరెడ్డి అడ్డుకోవడం సిగ్గుచేట న్నారు. టీడీపీవారితో ఇతరపార్టీలవారిని కూడా వైసీపీ బెదిరిస్తూ, ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎన్నికల కమిషన్ చోద్యంచూస్తోందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందు అంకుశం సినిమాలో రాజశేఖర్ లా ఆవేశపడిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఇప్పుడెందుకు వైసీపీనేతల కబంధహస్తాల్లో కీలుబొమ్మగా మారాడని రాజు ప్రశ్నించారు. ము న్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం, అత్యంత అరాచకంగా, నీచాతినీచంగా వైసీపీవారు వ్యవహరిస్తున్నా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకు మైనంగా ఉంటున్నాడన్నారు. గతంలో 26శాతం ఏకగ్రీవాలు ఎలా జరిగాయి..రాష్ట్రంలో ప్రజాస్వామ్యముందా అని ప్రశ్నించిన నిమ్మగడ్డ, నేడు జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు నోరెత్తడంలేదన్నారు? గవర్నర్ ను కలిసినతర్వాత నిమ్మగడ్డలో ఉన్నట్టుండి ఎందుకు మార్పువచ్చిందో, ఆమార్పుకు కారకులెవరో ఆయనే ప్రజలకు చెప్పాలని రాజు డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ, తనకున్న అధికారాలనుకూడా ఉపయోగించలేని హీనస్థితికి ఎందు కు దిగజారాడో ఆయనే స్పష్టంచేయాలన్నారు. చంద్రబాబునాయడిని అకారణంగా రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించిన ప్రభుత్వతీరుతో, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందాఅనే సందేహం ప్రతిఒక్కరికీ కలుగుతోందన్నారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో జగన్ పీనల్ కోడ్ ను అమలుచేస్తూ, పెత్తందారీమనస్తత్వమున్న పెద్దిరెడ్డి అనే ఒకనీచుడిచేతుల్లో కాల్మొక్తా..బాంచన్ దొరా... అంటూ కీలుబొమ్మలుగా మారడం సిగ్గుచేటని రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు.
చంద్రబాబునాయుడుకూడా జగన్ లా ఆలోచించిఉంటే, ఏ1 పాద యాత్ర సమయంలో కాలుబయటపెట్టగలిగేవాడా అని రాజు ప్రశ్నిం చారు. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తే, ఆయన మంచితనాన్ని వైసీపీనేతలు చేతగానితనంగా భావిస్తున్నా రన్నారు. నేటితరం యువత వైసీపీప్రభుత్వ కుట్రలు, కుతంత్రలను గమనించాలన్నారు. ఏంచేసినాసరే, చంద్రబాబునాయుడు లోకేశ్ తిరిగి ఏమీచేయలేరులే అనేభావనలో వైసీపీవారుంటే, వారి భ్రమ లు పటాపంచలయ్యలా, వైసీపీవారి పంచెలూడేలా వారిని తరిమికొ ట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రాజు తీవ్రస్వరంతో హెచ్చరించారు. చిత్తూరుజిల్లాలో మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిన్నటికి నిన్న ఎర్రచందనం స్మగ్లింగ్ లో బిజీగా గడిపాడన్నారు. మీడియా మొత్తం చంద్రబాబునాయుడి నిర్బంధంపై దృష్టిపెడితే, పెద్దిరెడ్డి మాత్రం తన దొంగవ్యాపారాల్లో మునిగితేలాడన్నారు. టీడీపీతరుపున మున్సిప ల్ పోరులో నిలిచిన అభ్యర్థులను కాపాడుకోవడానికి, వారిని ఇతర రాష్ట్రాల్లోదాచే పరిస్థితులు ఎవరు కల్పించారో ఎస్ఈసీ ఆలోచన చేయాలన్నారు. వైసీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే లా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్యలు తీసుకోవాలని రాజు కోరారు. ప్రతిపక్షపార్టీగా తామిచ్చిన ఫిర్యాదులన్నింటినీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాటిని బుట్టదాఖలు చేశాడని, ఆయనకు తమపార్టీకి సంబంధమేమిటో విలేకరులే చెప్పాలన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఎవరికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడోప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు.