ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉప ఎన్నికలకు, కేంద్ర ఎన్నిక సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతితో, ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 17న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ప్రచారంలో కానీ, అభ్యర్ధి ప్రకటనలో కానీ, నామినేషన్ వేయటంలో కానీ టిడిపి ముందు ఉంది. రెండు సార్లు కేంద్ర మంత్రిగా చేసిన పనబాక లక్ష్మిని ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించి, ఇప్పటికే నామినేషన్ కూడా వేసారు. అయితే అధికారంలో ఉండటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికను ఊదేస్తాం అంటూ ప్రకటనలు చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఫిజియోగా ఉన్న గుర్తుమూర్తిని ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. ఇక బీజేపీ-జనసేన విషయానికి వస్తే, జనసేన అనాసక్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. బీజేపీ పార్టీ, నిన్న అందరి కంటే ఆలస్యంగా తమ అభ్యర్ధిని ప్రకటించింది. వైఎస్ఆర్ ని, జగన్ మోహన్ రెడ్డిని ట్విట్టర్ లో అమితంగా పొగిడే, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభకు అవకాసం ఇచ్చారు. అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికకు సంబంధించి, కేంద్ర ఎన్నికల సంఘం, ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది.

tirupati 26032021 2

మామూలుగా ఓటు వేసే సమయంలో, ఎడమై చేతి వెలికి సిరా గుర్తు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఇలా ఏ ఎన్నికకు అయినా, ఇలా ఎడమ చేతికి సిరా గుర్తు, ఓటరుకు పెడతారు. దీని ద్వారా దొంగ ఓట్లు పడకుండా, జాగ్రత్త పడటానికి అధికారులకు ఉపయోగపడుతుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం, ఎడమ చేతికి కాకుండా, కుడి చేతికి సిరా గుర్తు పెట్టనున్నారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కుడి చేతి వేలు పై, సిరా చుక్కు పెడతారు. ఇప్పటికే ఈ విషయం పై, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి, రిటర్నింగ్ అధికారులకు ఉత్తర్వులు అందాయి. అయితే ఇందుకు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కారణం అని చెప్తున్నారు. 15 రోజుల క్రితం, మునిసిపల్ ఎన్నికలు జరిగాయి, అలాగే అంతకు ముందు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తిరుపతి ఉప ఎన్నిక జరిగే ప్రాతంలో ఓటర్లు కూడా, అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గున్నారు. ఆ సమయంలో ఓటు వేసిన వారికి వేసిన సిరా చుక్క, ఇంకా చాలా మందికి చేతికే ఉండటంతో, ఈ సారి మాత్రం ఎప్పుడూ లేని విధంగా, కుడి చేతికి సిరా చుక్క వేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read