ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయాణ, తమకు ఇచ్చిన సిఐడి నోటీసులు పై, అలాగే తమ పై ఎటువంటి ఆధారాలు లేకుండా నమోదైన సిఐడి కేసు పై హైకోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటు చంద్రబాబు, నారాయణ, అంటూ ప్రభుత్వం, సిఐడి తరుపు న్యావాదుల వాదనలు విన్న హైకోర్టు, కేసు పై స్టే వేధిస్తూ, నాలుగు వారాలు పాటు ఎటువంటి ఆక్షన్ వీరి పై తీసుకోకూడదు అంటూ, కేసు పై స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేస్తే, కోర్టు స్టే మాత్రమే ఇచ్చింది అంటూ, వైసీపీ చేసిన ఆరోపణలకు వెంటనే సమాధానం లభించింది. అసలు ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కాబట్టి, ఆయన వాదనలు కూడా వినాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆయన వాదనలు కూడా విన్న తరువాత క్వాష్ పిటీషన్ పై , కోర్టు ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసారు కాబట్టి, ఆప్పుడే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వాదన కూడా కోర్టు వినే అవకాసం ఉంది. అయితే దీనికి సంబంధించి, కోర్టు ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి ఈ రోజు నోటీసులు పంపించింది.
ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యలు కోర్టు చేసింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం, ప్రధమిక ఆధారాలు ఏమి లేకుండా, సీఆర్డీఏకు సంబందించిన జీవో పై విచారణ చేపట్టకూడదు అని స్పష్టంగా ఉంది కదా అని కోర్టు ఆ నోటీసులో ప్రశ్నించింది. అలాగే తాము సిఐడిని, చంద్రబాబు, నారాయణ నేరం చేసినట్టు మీ వద్ద ప్రాధమిక విచారణలో, ఏమి ఆధారాలు ఉన్నాయంటే, ఏమి సిఐడి చూపించలేకపోయిందని, హైకోర్టు ఆ నోటీసులో తెలిపింది. కేవలం జీవో జారీ చేసారని, సిఐడి కేసు ఎలా నమోదు చేస్తుంది అంటూ కోర్టు ప్రశ్నించింది. సిఆర్డీఏకి నష్టం కలిగితే వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటూ కోర్టు ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఆళ్ళ ఏమి సమాధానం చెప్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. రెండేళ్ళలో సంపాదించలేని ఆధారాలు, ఈ నాలుగు వారాల్లో ఆళ్ళ కాని, ప్రభుత్వం కాని, సిఐడి కాని సంపాదించి, కోర్టు ముందు పెడతారా ? అలా ఆధారాలు పెడితేనే ఈ కేసు నిలబడే అవకాసం ఉంది. ఆధారాలు చూపించకుండా, కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తే, ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వానికి భంగపాటు తప్పదు.