తిరుపతిలో జడ్జి రామకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో జడ్జి రామకృష్ణ హైకోర్టులో ఒక కీలక పిటీషన్ వేసారు. ఒక మాజీ హైకోర్టు జడ్జి, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కాబోయే మరో జడ్జి పై కుట్ర పన్నారని, దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉంది అంటూ, ఆయన హైకోర్టులో పిటీషన్ వేసారు. దీని పై సిబిఐ ఎంక్వయిరీ కూడా ఆదేశించారు. అయితే ఈ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, ఇప్పుడు ఈ కేసులో అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది. ఈ దెబ్బతో, ప్రభుత్వానికి భవిష్యత్తులో, కోర్టు చేతిలో చీవాట్లు తప్పవని కూడా విశ్లేషిస్తున్నారు. జడ్జి రామకృష్ణను ఒక కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో, ఆయన ఐ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ వ్యవహారం పై, పోలీసులు జడ్జి రామకృష్ణ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. తమ పరిధిలో ఉన్న ఫోన్, చోరీకి గురయ్యింది అంటూ, షాకింగ్ న్యూస్ చెప్పారు. స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫోన్ దొంగలించారని, చెప్పారు. అయితే పోలీసులు చేసిన వ్యాఖ్యల పై, రామకృష్ణ షాక్ తిన్నారు. ఇదంతా పోలీసులు ఆడుతున్న కట్టు కధ అని తేల్చి చెప్పారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ, తనను అన్ని రకాలుగా వేధిస్తున్న మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసారు. ప్రభుత్వం, పోలీసులను వాడుకుని, ఎలా అడ్డగోలుగా ప్రవర్తిస్తుందో ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన వాపోయారు. తన ఫోన్ లో అతి విలువైన సమాచారం ఉందని అన్నారు.

rk 20032021 2

అందులో ఆధారాలు ఉన్నాయని, పోలీసులు దాన్ని కోర్టులో డిపాజిట్ చేయకుండా, ఆ ఫోన్ ని మంత్రి పెద్దిరెడ్డికి ఇచ్చారని, తద్వారా అది సజ్జల వద్దకు వచ్చిందని అన్నారు. తన ఫోన్ ని ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేస్తే, ఫోన్ ఇచ్చేయాలని కోర్టు పోలీసులకు నోటీసులు ఇవ్వగా, 90 రోజులు అయినా ఇంకా ఫోన్ ని కోర్టులో డిపాజిట్ చేయలేదని. మూడు రోజులు క్రితం పోలీసులు ఈ విషయం పై కోర్టులో మేమో దాఖలు చేస్తూ, తమ కస్టడీలో ఉన్న ఫోన్ ని, ఎవరో దొంగలు దొంగతనం చేసారని ఆ మేమోలో పేర్కొన్నారని తెలిపారు. కేసుకు సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం అందులో ఉందని, న్యాయమూర్తులను ప్రభావితం చేసే అంశం పై, అనేక అధారాలు అందులో ఉన్నాయని, కుట్ర పూరితంగా ఫోన్ లాక్కుని, ఇప్పుడు ఫోన్ పోయిందని చెప్పటం, తీవ్ర అంశం అని అంటున్నారు. ఇందులోనే ఈశ్వరయ్య ఫోన్ సంభాషణలు ఉన్నాయని, ఇంత పెద్ద కేసుని తప్పుదోవ పట్టించటానికి, ఈ డ్రామాలు అన్నీ ఆడుతున్నారని, దీని పై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read