కాగలకార్యం గంధర్వులు తీర్చారన్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, అభిలాష, ఆత్రుత, ఆశ, ఉబలాటం, ఆరాటం సరైందికాదని, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సుస్పష్టంగా చెప్పిందని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోస భ్యులు వర్ల రామయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోనిపార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా.... ఒక తప్పుడుకేసును తెరపైకి తీసుకొచ్చారు. సీఐడీవారికి ఆళ్లరామకృష్ణారెడ్డనే మంగళగిరిఎమ్మెల్యేఫిర్యాదుచేస్తే, సీఐడీ వారు కంప్లైంట్ నమోదుచేసి, 22, 23వతేదీల్లో విచారణకు రావాల ని మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, మాజీ మంత్రి నారాయణకు నోటీసులిచ్చారు. సీఐడీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ చూశాక , ఆళ్లరామకృష్ణారెడ్డి ఫిర్యాదుచూశాక సబ్జెక్ట్ , నేరం ఏమీలేవని న్యాయస్థానానికి అర్థమైంది. కేసు రిజిస్టర్ చేసినవిధానం కూడా అదికాదు. ప్రభుత్వం తనపై నేరంచేయకుండానేచేసినట్లుగా తప్పుడుకేసులుపెట్టి కక్ష తీర్చుకోవాలని చూస్తోందని చంద్రబాబునాయుడుగారు నిన్న హైకోర్టుని కోరడం జరిగింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఈరోజు వాదనలు విన్నారు. ఈ ప్రభుత్వం ఏదోజరుగుతుందని చంద్రబాబునాయుడి కేసుపై చాలాచాలా అంచనాలు పెట్టు కుంది. ప్రభుత్వానికి మేలుచేస్తాడని ఒకాయన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమించుకుంది. ఆయనకు చంద్రబా బు కేసునువాదించడానికి అవకాశమిచ్చింది. ఈ ప్రభుత్వం ఆయన్నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తోంది. కేసుతాలూకా వాదనలు ప్రారంభమయ్యాక న్యాయమూర్తి ఇందులో చంద్రబాబునాయుడు, నారాయణ తప్పుచేసినట్లుగా ప్రాథ మిక నేరమేమైనా ఉందా అని అడిగారు. దానికి లేదు అనే సమాధానం వచ్చింది. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని జడ్జి అడిగితే, దానికిలేదనే సమాధానమే వచ్చింది. చంద్రబా బునాయుడు, నారాయణ తప్పుచేశారనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి లేవనే సమాధానమే వచ్చింది. రైతులేమైనా నష్టపోయారా, సీఆర్డీఏవారు ఏమైనా ఫిర్యాదుచేశారా అనే వాటికికూడా ప్రభుత్వన్యాయవాది నుం చి లేదనే సమాధానమే వచ్చింది. ఎవరూ ఫిర్యాదుచేయకుం డా కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. అసైన్డ్ రైతు లకు కూడానష్టపరిహారం అందింది కదా అన్న హైకోర్ట్ , సీఆర్డీఏలోని సెక్షన్ 146 ప్రకారం అధికారులను ఎలా విచారిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈకేసంతా తప్పుల తడకని, ఎవరినో సాధించడంకోసం ప్రభుత్వంపెట్టిన కేసని హై కోర్ట్ ఒకనిర్ణయానికి వచ్చింది.
అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చంద్రబాబు, నారాయణలను విచారించవద్దని కేసుపై స్టేఇచ్చింది. ఈ వ్యవహారమంతా ముఖ్యమంత్రికి తెలి సే జరిగింది కాబట్టి దీనిపై ఆయనేం సమాధానం చెబుతారు. 16 నెలలు జైల్లోఉండివచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఒక్కరోజైనా చంద్రబాబుని జైలుకుపంపాలన్న తాపత్రయంతోనే ఈవిధంగా తప్పుడుకేసు పెట్టారు. అందుకేగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేసుపెట్టించారు. హైకోర్ట్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ ఏజీ నీళ్లునమిలారు. ఎవరిని సాధించడానికి ప్రభు త్వం ఇటువంటి కేసుపెట్టిందో చెప్పాలి. ఎవరిపై కక్షతో ఈ కేసు పెట్టారు? చంద్రబాబునాయుడిగారికి ఇప్పుడు క్షమాప ణ చెబుతారా? చంద్రబాబుగారు నేను తొందరపడ్డాను, ఆలోచనలేకుండా మీపై కేసుపెట్టాము, నన్నునా ప్రభుత్వా న్ని క్షమించండని అడిగే నైతికవిలువలు జగన్మోహన్ రెడ్డి కి ఉన్నాయా? ముఖ్యమంత్రికి ఏమైనా నైతికవిలువలనేవి ఉంటే, ఇంకెప్పుడూ ఇటువంటి తప్పుడుకేసులుపెట్టనని చెప్పి, చంద్రబాబునాయుడిగారిని క్షమాపణ కోరాలి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పుడుకేసులు పెడుతూఉంటే, ప్రజలంతా ఆయన్ని తప్పుడువ్యక్తని ముద్రవేసేప్రమాదముం ది. ఆళ్లరామకృష్ణారెడ్డి మాటలు నమ్మవద్దని ముఖ్యమంత్రికి చెబుతున్నాను. ఎందుకంటే అతనొక కోర్టుపక్షి, తననియోజ కవర్గాన్ని వదిలేసి కోర్టులచుట్టూ తిరగడమే అతనిపని. కోర్టు ల్లో కేసులు వేయడమే ఆయనపని. అలావేసి,ఆయనేమైనా లబ్ది పొందుతాడేమో మాకైతే తెలియదు. అటువంటి కోర్టు పక్షి మాటలునమ్మి ముఖ్యమంత్రి అప్రదిష్టపాలయ్యారు చంద్రబాబునాయుడు చేసిన అవినీతిని కొంచెమైనా చూపండి రివార్డులుఇస్తాను..అవార్డులు ఇస్తాను అన్నారు. చివరకు కొండంతాతవ్వారు, ఏమీ దొరకలేదు. అనవసరంగా ఖర్చులు దండగ.
ఎప్పుడుకేసులువేసినా చంద్రబాబు కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకుంటాడని ఒకపనికిమాలిన మంత్రి వాగాడు. దానిలో తప్పేముందో ఆ మంత్రి చెప్పాలి. బుర్రలో ఏవిధమైన సరుకు లేకుండా మంత్రినని చెప్పుకుంటూ తిరిగే ఆవ్యక్తి సమాధానం చెప్పాలి. ఒకపనికిమాలిన , అవగాహనలేని మంత్రి చంద్రబా బు స్టేఎందుకు తెచ్చుకున్నాడంటున్నాడు. మరి వారి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైల్లోఉన్నాడు. రూ.48వేలకోట్లు కొట్టేశావయ్యా అన్నది సీబీఐ. మరి ఆ కేసు లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడు. ఈ రోజుకూడా జైల్లోనే ఉండిచిప్పకూడుతింటూ, కేసులవిచారణ ను ఎదుర్కొని, కడిగినముత్యంలా బయటకురావచ్చుకదా. బెయిల్ ఫై ఎందుకు బయటకువచ్చాడు. దానిపై పనికిమాలి న మంత్రి ఏంసమాధానంచెబుతాడు. ఎన్నికోర్టులు జగన్మో హన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించాయో ఆ మంత్రికి తెలుసా? భారతదేశంలో ఎవరూచేయనంతటి అవినీతి జగన్మోహన్ రెడ్డి చేశాడని కోర్టులుచెప్పాయి. అంతటి అవినీతి ఘనా పాటిఆయన. అటువంటివ్యక్తి కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకోవచ్చుగానీ, తప్పుడుకేసుపై చంద్రబాబుకోర్టుకెళ్లి స్టే తెచ్చుకోకూడదా? ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జాస్తిభూషణ్, చంద్రబాబుపై పెట్టినకేసుకు సంబంధించి హైకోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానంచెప్పలేకపోయాడు. జాస్తివారికిచెప్పండి.. చెట్టుపేరుచెప్పి కాయలు అమ్ముకోవద్ద ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నోఆశలు పెట్టుకున్నారు. ఆయనపెట్టుకున్నఆశలన్నీ అడియాశలయ్యాయి. తమకు జరిగిన అన్యాయంపై పౌరులు, కోర్టులను ఆశ్రయించడం అనేది భారతరాజ్యాంగం కల్పించిన హక్కు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకురాకుంటే, ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తింటూనేఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి , విజయసాయి రెడ్డి ల అవినీతి, కొందరు ఐఏఎస్ అధికారుల అవినీతి గురించి చరిత్రలో లిఖిస్తారు. అందులో ఎలాంటి సందేహంలేదు. భవి ష్యత్ లోవారిబిడ్డలే వారిచరిత్రను చదివేరోజు వస్తుంది.
అవినీ తికి పాల్పడినవారంతా ఎందుకు కోర్టుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. విచారణకు హాజరై, న్యాయస్థానంలో పోరాడవ చ్చుకదా? తప్పుడుకేసుపెడితే, ఎఫ్ఐఆర్ నమోదుచేయడా నికి సరైన మెటీరియల్ లేని, ఎటువంటి ఆధారాలులేని కేసు పెడితే, చంద్రబాబునాయుడుగారుకోర్టు కెళ్లకూడదా? స్టే తెచ్చుకోకూడదా? దాన్నితప్పుపడుతున్న వ్యక్తి, రాష్ట్రానికి మంత్రికావడం ప్రజల దౌర్బాగ్యం. న్యాయవ్యవస్థ గౌరవం, గొప్పతనం ఈ దొంగలముఠాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, కొందరుఅధికారులు నెగిటివ్ యాటిట్యాడ్ కు అలవాటుపడ్డారు. దళితులంతా తమకుఅన్యాయం జరగలేదని చెబుతుంటే, వారినికొట్టి బలవంతంగా ఒప్పిస్తారా ..? నిజంగా అన్యాయంజరిగితే వారే సీఐడీతోచెప్పొచ్చుకదా ? అంతా తప్పుడువిధానమని అర్థంకావడంలా. జగన్మోహన్ రెడ్డిచేస్తేనేమో చట్టబద్ధమా.... ఆయన బెయిల్ తెచ్చుకుంటే చట్టబద్ధమా...ఆయన కోర్టుకెళితే చట్టబద్ధమా... బెయిల్ కోసం కోర్టులచుట్టూ తిరిగితే అదిన్యాయమా... చంద్రబాబు నాయుడు తప్పుడుకేసుపై హైకోర్టునాశ్రయిస్తే అది తప్పా? ఏంటండి ఇదీ.. హైకోర్టు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆచెంప ఈ చెంప వాయించింది కదా.. ఆవిషయం ముఖ్యమంత్రికి ఎందు కు అర్థంకావడంలేదు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ జాస్తి భూషణ్ ఈరోజు కోర్టులో జరిగింది చెబితే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయడు. ముఖ్యమంత్రి గారు తానా అంటే తందానా అనడమేంటి? ఎప్పుడూ చంద్ర బాబుపై , ఆయన కులంపై పడి ఏడవడమేగా ఈప్రభుత్వ పని. అమ్మఒడి అంటూ బిడ్డలకు భవిష్యత్ లేకుండా చేస్తు న్నారని, ఒకముసలావిడ అడిగింది. దానికేం సమాధానం చెబుతారు మీరు? ఆమెకుసమాధానంచెప్పలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. సబ్ ప్లాన్ నిధులను ఓట్లుకొనడానికి ఈముఖ్యమంత్రి వాడుతున్నాడు. ఆ విషయం మాకు తెలియదా? పెద్దపెద్ద నియంతలుకూడా కాలగర్భంలో కలి సిపోయారు. చట్టం, న్యాయమనేది ఒకటుంది. భారతదేశంలో ఇంకా ఒకేఒకవ్యవస్థ డిస్టర్బ్ అవ్వలేదు. అది న్యాయవ్యవస్థ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. నేడు హైకోర్టు నుంచి తీర్పురాకుంటే, చంద్రబాబుని అరెస్ట్ చేసేవారుకదా? ఇప్పటి కైనా ముఖ్యమంత్రి తనవిధానాలు మానుకొని రాజ్యాంగ బద్ధంగా నడవాలనికోరుతున్నాను.