విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కలకలం రేపే సంఘటన ఇది. విశాఖ ఉక్కు ఉద్యమంలో, ఈ రోజు ప్రతిష్టాత్మిక కార్యక్రమం అయిన, ఉక్కు గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇప్పటికే ఈ కార్యకరమానికి సంబంధించి విజయవంతం చేసేందుకు, దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కార్మిక సంఘాలు వైజాగ్ చేరుకున్నాయి. అన్ని సంఘాలు నేతలు కూడా మద్దతు పలికి ఈ రోజు సాయంత్రం ఉక్కు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్న, శ్రీనివాస్ అనే కార్మికుడు రాసిన లేఖ బయట పడటంతో, షాక్ తిన్నారు. ఈ రోజు సాయంత్రం తాను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, ప్రాణ త్యాగం చేస్తానాని రాసారు. 5.49 నిమిషాలకు తాను అగ్నికి ఆహుతి అవుతాను అంటూ, ఆ లేఖలో రాసారు. విశాఖ ఉక్కు సాధించుకోవటానికి 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిందని, ఇప్పుడు నేను త్యాగం చేయటం ద్వారా ఈ ఉద్యమం ఉదృతం అవ్వటమే కాకుండా, విశాఖ ఉక్కు సాధించుకుంటాం అనే ఉద్దేశంతోనే, ఆయన ఈ పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తరంలో ఆయనే స్వయంగా రాసి, ఆయన ఫోన్ నెంబర్ , సంతకం పెట్టి, జాబ్ రోల్స్ బుక్ లో ఎంటర్ చేయటం అక్కడ ఉద్యోగులు గుర్తించారు.

letter 200032021 2

నిన్న నైట్ షిఫ్ట్ ముగించుకుని, తిరిగి వెళ్ళే సమయంలో, ఆయన జాబ్ రోల్స్ బుక్ లో ఎంటర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు అనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ లేఖ రాసిన తరువాత, ఆయన కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులకు కూడా ఆచూకీ తెలియటం లేదు. ఉద్యోగులు, పోలీసులు, కుటుంబీకులు, ఆయన కోసం వెతుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది. కార్మిక సంఘాల నేతలు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన ఆచూకీ ఎలా అయిన కనుక్కుని, రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కార్మిక సంఘాలు నేతలు కూడా, ఎవరూ క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు, పోరాటం చేద్దాం, కలిసికట్టుగా ఉద్యమం చేద్దామని, తోటి ఉద్యోగులకు పిలుపిచ్చారు. ఈ రోజు సభలో కూడా ఇదే విషయం చెప్పటానికి రెడీ అయ్యారు. అయితే శ్రీనివాస రావు ఆచూకీ ఉదయం నుంచి దొరక్కపోవటంతో, ఆయన్ను సేఫ్ గా ముందు కనుక్కోవాలని అందరూ తలా వైపు వెళ్లి వెతుకుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read