మంత్రి పెద్దిరెడ్డి, బొత్సా ఇచ్చిన ఫిర్యాదు పై, నిన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు, నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, ఈ రోజు రాతపూర్వకంగా, వివరంగా లేఖ రాస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. నిన్న అసెంబ్లీ కార్యదర్శి, నిమ్మగడ్డకు నోటీస్ పంపించిన విషయం తెలిసిందే. దీనికి సంబధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శికి రిప్లై ఇచ్చారు. దానిలో ప్రివిలేజ్ కమిటీ తనకు పంపించిన నోటీసులకు, తాను ఆ విచారణ పరిధిలోకి రానని స్పష్టంగా తెలియచేసారు. శాసనసభ హక్కులకు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తాను ఏమి వ్యవహరించలేదని, చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అసెంబ్లీ అయినా, శాసనమండలి అయినా, తనకు పూర్తి స్థాయిలో గౌరవం ఉందని, ఆ రిప్లై లో నిమ్మగడ్డ స్పష్టం చేసారు. ఇంత చెప్పిన తరువాత కూడా, దీని పై మరింత ముందుకు వెళ్ళాలని భావిస్తే మాత్రం, కచ్చితంగా సరైన సమయంలో, తగిన ఆధారాలతో తాను స్పందిస్తానని చెప్పి, ఆయన స్పష్టంగా, ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇది వివరణ అని చెప్పటానికి కూడా లేదని, ఆయన అభిప్రాయాన్ని, చాలా ఘాటుగా ప్రభుత్వానికి చెప్పారని, భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తాను కవిడ్ టీకా తీసుకున్నానని అన్నారు.

nimmagadda 19032021 2

తాను ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నానని, ఫిసికల్ గా ప్రయాణం చేయాలంటే, తనకు కొంత సమయం అవసరం అని, విషయాన్ని స్పష్టం చేసారు. మొత్తం మీద, నిమ్మగడ్డకు ప్రివేలేజ్ కమిటీ నుంచి, అసెంబ్లీ కార్యదర్శి పంపించిన నోటీస్ తో,చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ, తాను ఎవరి హక్కులకు భంగం కలిగించలేదని, అసలు తాను ఈ విచారణ పరిధిలోకి రాను అని స్పష్టం చేసారు. అంతే కాకుండా, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, తాను స్పష్టమైన ఆధారాలతో వస్తాను అని చెప్పటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఏమి ఆధారాలతో వస్తారు, ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్పారు అనే విషయం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. సరైన సమయంలో, ఆధారాలు ఇస్తాను అని చెప్పటం చూస్తుంటే, చాలా గట్టిగానే ప్రభుత్వంతో సై అనే విధంగా, ఆయన స్పందించారు. దీని పై మరి ప్రభుత్వం, ప్రివిలేజ్ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే, మరోసారి నోటీసులు ఇవ్వటం, తరువాత ఏదైనా దూకుడు నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read