రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఈ రోజు హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ లో ముఖ్యంగా, ఏదైతే తాను గవర్నర్ తో జరిపే కరెస్పాండింగ్స్ అన్నీ బయటకు లీకు అవుతున్నాయని, కొందరు మంత్రులు కూడా నిమ్మగడ్డ, గవర్నర్ కు రాసిన లేఖలు తాము సోషల్ మీడియాలో చూసాం అని బహిరంగంగానూ మీడియా ముఖంగా కూడా చెప్తున్నారని, తాను రాసే లేఖలు ప్రివిలేజ్ లెటర్స్ అని, వాటిని బహిర్గతం చేసే అధికారం లేదు అంటూ, ఆయన కోర్టులో ఈ రోజు పిటీషన్ వేసారు. ఈ మొత్తం వ్యవహారం పై, కేంద్రం నిఘా సంస్థలతో, సిబిఐ లాంటి సంస్థలతో విచారణ జరిపించాలని, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇదే అంశం పై, ఈ రోజు హైకోర్ట్ లో, ఈ పిటీషన్ 27 వ అంశంగా ఫైల్ అవ్వటం జరిగింది. ఈ పిటీషన్ న్యాయమూర్తి రఘునందన రావు బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఈ పిటీషన్ తన బెంచ్ ముందుకు రాగానే, న్యాయమూర్తి రఘునందన రావు ట్విస్ట్ ఇచ్చారు. ఈ పిటీషన్ నాట్ బిఫోర్ మీ అంటూ, ఆయన బెంచ్ మీద నుంచి వెళ్ళిపోయారు. సాధారణంగా నాట్ బిఫోర్ మీ అనే పిటీషన్లు, న్యాయముర్తికి ఇది వరకు పిటీషనర్ తో ఎలాంటి సంబంధాలు అయినా ఉన్నా, లేకపోతే న్యాయవాదుల దగ్గర ఇది వరకు పని చేసినా, లేదా ఈ పిటీషన్ బంధువులది అయినా, నాట్ బిఫోర్ మీ అని చెప్పి, జడ్జి తప్పుకుంటారు.
అలాంటి సందర్భం అయితేనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. న్యాయమూర్తి రఘునందన రావు, ఈ పిటీషన్ పై ఒక విషయం స్పష్టం చేసారు. ఈ పిటీషన్ వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేయాలని, రిజిస్టర్ ను చీఫ్ జస్టిస్ ఈ విషయం పై ఆదేశించి, ఈ పిటీషన్ వేరే బెంచ్ కు వెళ్ళేలా చూడాలని , ఆయన చీఫ్ జస్టిస్ ను అభ్యర్ధించారు. సంబంధిత రిజిస్టార్ ఈ పిటీషన్ ను వేరే బెంచ్ కు పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో, ఈ కేసు ఈ రోజు ఎలాంటి విచారణ జరగకుండా వాయిదా పడింది. అయితే ఇది మళ్ళీ ఎవరి బెంచ్ కు పోస్ట్ అవుతుందని, చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అనే విషయం పై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకుంది. ఇది హైప్రొఫైల్ కేసు కావటం, ఏకంగా గవర్నర్ ఆఫీస్, మంత్రులను ప్రతివాదులుగా చేర్చటంతో, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. గవర్నర్ ఆఫీస్ ను ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అనే అనుమానం రావటం, ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం , సిబిఐ ఎంక్వయిరీ చేయాలనే సంచలన కేసు కావటంతో, ఈ పిటీషన్ ఈ రోజే వేరే బెంచ్ ముందుకు వస్తుందా, లేదా వచ్చే వారం వస్తుందా అనేది చూడాలి.