పెరిగినధరలతో పేద, మధ్యతరగతి వారు నానాఇబ్బందులు పడుతున్నారని, క-రో-నాప్రభావం, ప్రభుత్వనిర్లక్ష్యంతో పేదలు పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ వాపోయారు. శనివారం ఆయన మంగళగిరిలోనిపార్టీజాతీయ కార్యాలయంలో విలేకర్ల తో మాట్లాడారు. పండించిన పంటఉత్పత్తులకు రైతులకు గిట్టుబాటుధర అందడంలేదని, మరోవైపు ప్రజలకేమో ధరల పరంగా నిత్యావసరాలు అందుబాటులో లేకుండా పోయాయ న్నారు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివన్నట్లుగా పరిస్థితి తయారైందని, ముఖ్యమంత్రి వాస్తవాలకు దూరంగా వ్యవహ రిస్తూ కాలక్షేపంచేస్తున్నాడన్నారు. జగన్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఒక్కరోజుకూడా పెరిగినధరలపై సమీక్షచేయ లేదన్నారు. అప్పులు ఎలా తేవాలి.... ప్రతిపక్షాలను ఎలా బెదిరించాలనే వాటిపై మాత్రమే ముఖ్యమంత్రి సమీక్షలుచేస్తా డు తప్ప, పేదలకడుపునింపడం, సంపదసృష్టించి ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధిచేయాలనేదానిపై ఆయనఆలోచించడని రఫీ ఎద్దేవాచేశారు. ఒక్కరోజుకూడా ముఖ్యమంత్రి బహిరంగ మార్కెట్లను సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న పాపానపోలేదన్నారు. చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన రైతుబజార్లను జగన్ తొలగించాడన్నారు. ముఖ్యమంత్రే ప్రజ లగురించి పట్టించుకోకుంటే, ఇకమంత్రులుకూడా తమతమ జిల్లాల్లో ఏనాడూ ప్రజలస్థితిగతులు, పెరిగినధరలపై ఆలోచన చేయడంలేదన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, ఒక్కటంటేఒక్క పరిశ్రమకూడా రాష్ట్రానికి రాలేదన్నారు. దానికితోడు, ధరలుపెరగడంతో సామాన్యుల పరిస్థితి ముందునుయ్యి, వెనుకగొయ్యి చందం గా మారిందని రఫీ ఆవేదనవ్యక్తంచేశారు. రూ.5వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశానని, ధరలుపెరిగినప్పు డు, ఆసొమ్ముతో వాటిని నియంత్రిస్తానని అసెంబ్లీలో ముఖ్య మంత్రిచెప్పిన మాటలు ఏమయ్యాయని టీడీపీనేత ప్రశ్నించా రు.
రూ.5వేలకోట్లు ఏమయ్యాయో, అధికారులంతా బ్లాక్ మార్కెటింగ్ పై దృష్టిపెట్టి, ధరలను తగ్గించేచర్యలపై ఎందుకు దృష్టిపెట్టడంలేదన్నారు. రాష్ట్రమార్కెటింగ్ శాఖామంత్రి పేకాట ఆడించడంపై, ఇసుకతరలింపుపై, చంద్రబాబునాయుడిని దూషించడంపైనే శ్రద్ధపెట్టాడుతప్ప, తనశాఖపరిధిలో జరిగే విషయాలను పట్టించుకోవడంలేదన్నారు. సదరు మంత్రి ధ్యాసంతా అక్రమసంపాదనపైనేఉందన్నారు. ఎన్నికలప్రచార వేళ పెట్రోల్ సీసాలుచేతబట్టి, మనరాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలుఎక్కువగా ఉన్నాయని గగ్గలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటిధర సెంచరీకిచేరువైనా ఎందుకుస్పందించడం లేదన్నారు? ఆనాడు పెట్రోల్ సీసాలు పట్టుకొని చంద్రబాబు ప్రభుత్వాన్నివిమర్శించిన వ్యక్తి, అధికారంలోకివచ్చాక ధరలు పెంచేసి ప్రజలను దారుణంగా దోచుకుంటున్నా డన్నారు. ఇసుక, మద్యంపై వచ్చేఆదాయమంతా ఎటు పోతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలన్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలుపెంచిన ముఖ్యమం త్రి, తాజాగాఇంటిపన్నును ఆస్తిపన్నుగా మార్చేసి, పేదలను పీల్చుకుతినడానికి సిద్ధమయ్యాడన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే, దానిపై కేంద్రంతో ఒక్కరోజుకూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వేసే ట్యాక్స్ ను జగన్మోహన్ రెడ్డిఎందుకు తగ్గించడన్నారు.
ధరల కట్టడి లో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతా నికి పస్తులుంటే పండక్కి పరమాన్నంపెడతామన్నట్లుగా జగన్ ప్రభుత్వం పేదలవిషయంలో వ్యవహరిస్తోందని రఫీ మండిపడ్డారు. ప్రభుత్వవైఖరిని ప్రశ్నించేవారిని సెక్షన్లు, తప్పుడుకేసులతో అణగదొక్కుతున్న ముఖ్యమంత్రి పేదలు, మద్యతరగతి వారిగురించి కనీసమాత్రం కూడాఆలోచించడం లేదన్నారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే ధరలపెరుగుదలకు కారణమని టీడీపీనేత తేల్చిచెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో కేజీబియ్యం రూ.40 ఉంటే, ఇప్పుడు రూ.50కు పెరిగిందని, కేజీకందిపప్పు రూ.74నుంచి రూ.120కు, పెసరపప్పు రూ. 75 నుంచి రూ.107కు, మినపప్పు రూ.65నుంచి రూ.125 కు, వేరుశనగపప్పు రూ.80నుంచి రూ.140కు పెరిగాయ న్నారు. ప్రతిదానిధర వైసీపీప్రభుత్వంలో రెట్టింపు అయ్యిందని, ఆఖరికి వంటనూనెలు కూడా రెండింతలు పెరిగాయన్నారు. పెరిగినధరలతో ప్రతికుటుంబం నిత్యావస రాలనుకొనలేక అరకొరగాకొంటూ, అర్థాకలితోతింటూ బతుకు తోందన్నారు. పేదలకు కడుపునిండా తిండికూడా పెట్టలేని ప్రభుత్వం ఉంటేఎంత, పోతేఎంతని రఫీ ప్రశ్నించారు. మద్యం ధరలను విపరీతంగాపెంచిన వైసీపీప్రభుత్వం చీప్ లిక్కర్ కంటే దారుణమైనకల్తీమద్యాన్ని రూ.200లకు అమ్ముతోంద న్నారు. ఐరన్, సిమెంట్ ధరలను కూడా జగన్ రెడ్డి అమాంతం పెంచేశాడన్నారు. ఎవరుపెంచినా, ఏమి పెరిగినా పట్టించుకోకుండా ఉన్నది ఈప్రభుత్వం, ముఖ్యమంత్రేనని రఫీ తెలిపారు. ధరల పెరుగుదలపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకుంటే, ఆడవాళ్లంతారోడ్లపైకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయమని ఆయన హెచ్చరించారు.