ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీకి రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమె రిటైర్డ్ అయిన తరువాత ఆమెకు, ఒక సలహాదారు పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. చీఫ్ అడ్వైజర్ హోదాను ఆమెకు జగన్ ఇచ్చారు. అయితే తాజాగా ఆమెకు , ఆ పదవికి ఎంత జీతం, ఇతర సౌకర్యాలు ఏమిటి అంటి చెప్తూ, ఒక జీవో విడుదల చేసారు. నీలం సాహనీకి ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇస్తూ, జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆమెకు ఇచ్చే జీతం కూడా నిర్ధారించారు. ఆమెకు రూ.2.5 లక్షల జీతం వస్తుందని, ఆ జీవోలో తెలిపారు. అంతే కాదు, ఆమెకు తొమ్మిది మంది సిబ్బందిని కూడా ప్రభుత్వ ఖర్చులతో పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక నీలం సాహనీ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా, ఆ పదవిలో రెండేళ్ళు కొనసాగనున్నారు. అయితే ఇప్పటికే సలహాదారులు, వాళ్లకు ఇచ్చే లక్షల లక్షల జీతాల పై, విమర్శలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయటం లేదు. తమకు అనుకూలం అనుకుంటే చాలు, పదవులు ఏమి లేకపోయినా, కొత్త పదవులు సృష్టించి మరీ, పదవులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే, తనకు ఎంతో నమ్మకస్తురాలుగా పేరు తెచ్చుకున్న, నీలం సాహనీకి, రిటైర్డ్ అయిన తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
ఆమెకు మంచి పదవి ఇవ్వటం, జీతం ఇవ్వటంతో పాటుగా, క్యాబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆమె పని తీరు నచ్చి, రిటైర్డ్ వయసు అయిపోయినా కూడా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంతో మాట్లాడి, ఆరు నెలలు చీఫ్ సెక్రటరీ పదవి పొడిగించారు. కరోనా కాలంలో, ఆమె సేవలు రాష్ట్రానికి అవసరం అని, కేంద్రాన్ని ఒప్పించి, రెండు సార్లు, మూడు మూడు నెలలు పాటు, పొడిగింపు తెచ్చుకున్నారు. గతంలో ఎల్వీ శుభ్రమణ్యం వైఖరి నచ్చక ఆయన్ను అకారణంగా బదిలీ చేయటం, తరువాత నీలం సహానీ రావటం, ఆమె రిటైర్మెంట్ తరువాత కూడా, అధిక ప్రాధాన్యత ఇవ్వటం, జరిగిపోయాయి. 1984 బ్యాచ్ కు చెందిన నీలం సాహ్నీ, పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆమెకు ముఖ్యపదవి ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత, ఉన్న అనేక అంశాల పై, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, విభజన సమస్యలతో పాటుగా, పునర్విభజన చట్టంలో ఉన్న వివిధ అంశాలు పరిష్కరించే బాధ్యత ఇచ్చారు. అయితే ఆమె జీత భత్యాల పై విమర్శలు వస్తున్నా, విభజన సమస్యలు పరిష్కరిస్తే అంత కంటే ఏమి కావాలి. చూద్దాం.