సహజంగా పార్లమెంట్ లో వేసే ప్రశ్నలు, తమ పార్టీకి లాభం చేకురేలా, లేదా తమ ప్రభుత్వానికి లాభం చేకురేలా , సభ్యులు ప్రశ్నకు వేస్తూ ఉంటారు. కేంద్రం చెప్పే జవాబుని, తమ గోప్పతనంగా చెప్పుకోవాటానికి, తద్వారా ప్రజలకు గోప్పాగా చెప్పుకుంటారు. ఈ ప్రశ్నలు వేసే క్రమం కూడా, తమ అధినేత ద్రుష్టిలో పడటానికి, మార్కులు కొట్టేయటానికి కూడా వేస్తూ ఉంటారు. దీనికి వైసిపీ ఎంపీలు ముందు ఉంటారు. అయితే వారికి మాత్రం, ఇది రివర్స్ అవుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తె, కేంద్రం చెప్పే జవాబు డబ్బా కొట్టుకుందాం అంటే, అక్కడ నుంచి వచ్చే జవాబు మొత్తం రివర్స్ లో వస్తుంది. ఒకటి రెండు కాదు, ఈ మధ్య తరుచూ ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ ఎంపీలు. సరిగ్గా మునిసిపల్ ఎన్నికలు ఒక్కరోజు ముందు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై వాళ్ళు వేసిన ప్రశ్నకి, మొత్తం వైసీపీ ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నాం, వారికి అంతా తెలుసు అంటూ, కేంద్రం చెప్పిన సమాధానంతో బొక్క బోర్లా పడ్డారు. విశాఖ మునిసిపల్ ఎన్నికల్లో చాలా తేలికగా గెలిచేస్తాం అని చెప్పిన వైసీపీ వర్గాలు, ఆ ప్రశ్నతో, మొత్తం తారు మారు అయ్యిందని, చాలా అతి కష్టం మీద బయట పడినట్టు చెప్తూ ఉంటారు. దీంతో చీవాట్లు తిన్నారు. అలాగే నిన్న కూడా, ఇలాంటి ప్రశ్నలతోనే వైసీపీ ఎంపీలు బొక్క బోర్లా పడి, తమ అసమర్ధత గురించి తామే అడిగారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్ ల గురించి, విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు. ఇది కూడా జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలేలా కేంద్ర మంత్రి నుంచి సమాధానం వచ్చింది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్ లు ఎలా నడుస్తున్నాయి, ఎప్పటికి పూర్తవుతాయి అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు. దీనికి కేంద్ర రైల్వే శాఖా మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చే నిధులు ఇవ్వటం లేదని, కనీసం భూసేకరణ కూడా చేపట్టటం లేదు అంటూ, కేంద్ర రైల్వే శాఖా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వేల కోట్లు విలువైన పనులు నిలిచిపోయాయని చెప్పారు. నిధులు కొరతతోనే కడపలోనే రైల్వే పనులు ఆగిపోయాయని చెప్పారు. సాక్షాత్తు జగన్ సొంత జిల్లాలో కూడా, ఏపి ప్రభుత్వం సహకరించటం లేదు అంటూ, మెసేజ్ ఇచ్చారు. అయితే దీని పై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్రం ఇంత స్పష్టంగా చెప్తుంటే, రాష్ట్ర వాటా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నాయి. అడిగి తిట్టించుకోవటం అంటే ఇదే అని వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.