నవ్యాంధ్ర ప్రయాణం 2014లో ఎలా మొదలైందో అందరికీ తెలుసు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మనలని రోడ్డున పడేసారు. హేళన చేసారు, తక్కువ చేసారు. ఆ కసిలో నుంచి నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది. రాజధాని కట్టుకోవటానికి చేతిలో పైసా లేదు. సంక్షోభాన్ని, అవకాశంగా మలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన, ఈ సమస్యను అధిగమించింది. రాష్ట్రానికి మధ్యలో, అన్ని వసతులు, వనరులు ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజాధానిగా ఎంపిక చేసారు. అక్కడ రైతులను ఒప్పించి, భూసేకరణ పధ్ధతిలో, రూపాయి ఖర్చు లేకుండా 33 వేల ఎకరాలు సమీకరించారు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఇది ఒక రికార్డు. ఒక్క సెంటు స్థలం కూడా ప్రభుత్వాలు, నిరసనలు లేకుండా ప్రజల నుంచి తీసుకోలేవు. అలాంటిది 33 వేల ఎకరాలు ప్రజల నుంచి చంద్రబాబు సమీకరించారు. అనుకున్నట్టే పనులు జరిగాయి. అక్కడ నుంచి పరిపాలన కూడా ప్రారంభం అయ్యింది. ఈ లోపు ప్రభుత్వం మారింది. చంద్రబాబు స్థానంలో, జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. మొదటి నుంచి అమరావతి పై ఉన్న ద్వేషం, అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువ అయ్యింది. నిర్మాణాలు ఆగిపోయాయి. ఏదో ఒక రోజు నిర్మాణాలు మొదలవుతాయి అనే ఆశలో ఉన్న రైతులకు, షాక్ ఇస్తూ, దేశంలో ఎక్కడ లేని, మూడు రాజధానుల ఫార్ములా తీసుకుని వచ్చారు.

hc 22032021 2

అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి అమరావతి రైతులు, ప్రభుత్వం పై పోరాటం మొదలు పెట్టారు. ఇప్పటికే 450 రోజులకు పైగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా న్యాయ పోరాటం కూడా రైతులు చేస్తున్నారు. దాదాపుగా 60కు పైగా పిటీషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పడ్డాయి. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలో, ఈ కేసులు చాలా వేగంగా ముందుకు వెళ్ళాయి. సంక్రాంతి తరువాత, తీర్పు వస్తుందని అందరూ భావించిన సమయంలో, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ నేపధ్యంలో, కొత్త చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి వచ్చిన తరువాత, అమరావతి కేసు పై ఎలా ముందుకు వెళ్తారు అనే సస్పెన్స్ నెలకొంది. ఈ నేపధ్యంలోనే, అమరావతి కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి కేసులకు సంబంధించి, ఈ కేసులు వాదించటానికి, కొత్త బెంచ్ ఏర్పాటు అయ్యింది. జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు అయ్యింది. అమరావతి కేసులు మళ్ళీ ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం అవుతాయి. అయితే విచారణ కొనసాగిస్తారా, లేదా మళ్ళీ మొదటి నుంచి వాదనలు వింటారా అనే టెన్షన్ నెలకొంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read