నిన్న వచ్చిన ఫలితాల పై, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మూడు ప్రశ్నలు అంటూ, వాటిని ప్రజలకు వేసారు. మొదటి ప్రశ్న, ఇద్దరి మహిళల కధ అని, ఇద్దరి మహిళలకు భర్తలు లేరని, ఇద్దరికీ పిల్లలు ఉన్నారని, అయితే ఇద్దరికీ ఉద్యోగులు లేవని, డబ్బు లేదని, కుటుంబాన్ని పోషించుకోవటానికి, ఒక మహిళా వే-శ్య-గా మారిందని, మరొక మహిళ కష్టపడి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందని అన్నారు. అయితే ఈ ఇద్దరిలో, మనం మన సమాజంలో ఎవరిని గౌరవిస్తాం అంటూ, ప్రజలను మొదటి ప్రశ్న వేస్తూ, ప్రజలే దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇక రెండో ప్రశ్న వేస్తూ, యుద్ధం జరుగుతుంటే వీరులు ముందుకు పోయి పోరాడి, ధైర్యంగా నిలబడి గెలుస్తారని, మరో పక్క ఇంకో రకం, యుద్ధంలో తలపడకుండా, వెనకునుండి క--త్తి-తో పొ-డి-చి, గెలుస్తారని, ఇలా రెండు రకాలుగా గెలిచే వారిలో, మనం మన సమాజంలో ఎవరిని గౌరవిస్తాం అని, ప్రజలను అడుగుతున్నా అంటూ రెండో ప్రశ్న వేసారు. ఇక మూడో ప్రశ్నగా, ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలను అడుగుతున్నా అని, ప్రజలే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.
ఈ ఎన్నికలు సరిగ్గా జరిగాయో లేదో అని నేను చెప్పను అని, వాస్తవాలు అన్నీ మీ ముందు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఇది సరైన ఎన్నికా కాదా అనేది మీరే నిర్ణయించాలని, దీనికి మీరే సమాధానం చెప్పాలి అంటూ, రాష్ట్ర ప్రజల ముందు మూడు ప్రశ్నలు ఉంచారు దీపక్ రెడ్డి. ఏపి ఎడిటర్స్ గిల్ అనే సంస్థ, వైసీపీ పార్టీ, దాదాపుగా పది వేల కోట్లు ఖర్చు చేసిందని, చెప్పారని, ఈ డబ్బు అంతా, ఈ వైసీపీ నేతలకు ఎక్కడ నుంచి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నా అంటూ, దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏకాగ్రీవాలు అయిపోయాని, వైసీపీ నేతలు చించుకుంటున్నారని, రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి, గెలిచిన ఈ గెలుపు పై, వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. వీళ్ళు చేస్తున్న పనులకు ప్రజలు ఓటింగ్ కు రాలేదని, లెక్కలు చూస్తే అర్ధం అవుతుందని, ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందో అధికార పార్టీనే చెప్పాలని అన్నారు. తా-డి-ప-త్రి-లో టిడిపి విజయం గురించి హేళనగా మాట్లాడుతున్న వాళ్ళు, దమ్ము ఉంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేను రాజీనామా చేసి, మళ్ళీ గెలవమనలని సవాల్ విసిరుతున్నట్టు దీపక్ రెడ్డి అన్నారు.