నిన్న మంత్రి పెద్దిరెడ్డి, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. రఘురామరాజు బ్లాక్ షీప్ అని, కొమ్ములు లేని దున్నపోతు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, రఘురామకృష్ణంరాజుకి సవాల్ చేసారు. రఘురామకృష్ణం రాజు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు. రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల పై, పెద్దిరెడ్డి ఇంత ఘాటుగా మాట్లాడటంతో, రఘురామరాజు ఎలాంటి కౌంటర్ ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, రఘురామకృష్ణం రాజు అంతే దీటుగా, జవాబు ఇచ్చారు. నా బొచ్చు గురించి, నా స్థాయి గురించి, నన్ను ఏకవచనంతో, అసభ్యంగా సంబోదిస్తున్న, అవినీతి మంత్రి పెద్దిరెడ్డికి, మేము మర్యాదగా మాట్లాడే భాష అర్ధం కాదు కాబట్టి, రాయలసీమ భాషలో చెప్తున్నా అని, ఘాటు వ్యాఖ్యలు చేసారు. నేనే కనుక ముఖ్యమంత్రి అయితే, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఆయన అంటున్నారని, అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతకాని వాడని, ఆయన ఉద్దేశమా అని, రఘురామరాజు వ్యాఖ్యానించారు. నేనే ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నారు అంటే, రిపబ్లిక్ టీవీ కధనానికి, దీనికి ఏదో లింక్ ఉండే ఉంటుందని, నేను అన్నాను. ఇప్పటి వరకు నేను పెద్దిరెడ్డి గారు అని సంబోధించాను, కానీ మనిషికి ఒక మాట, గొద్దుకు ఒక దెబ్బ అని, ఈయనకు అదే భాషలో చెప్పాలి కదా అని రఘురామ రాజు అన్నారు.
నేనే ముఖ్యమంత్రి అయితే, అనే మాట ఎందుకు అన్నావ్ పెద్దిరెడ్డి అనేది నా ప్రశ్న. నీ మోహంలో అసహనం కనిపిస్తుంది పెద్దిరెడ్డి అని ప్రశ్నించారు. నేను ఏబీఎన్ రాధాకృష్ణ కుమ్మక్కు అంటున్నారు, మరి సాక్షి9, సాక్షి ఎన్, సాక్షి 10 లో నీ గురించి ఆ కధనాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే, దానికి ఏమి సమాధానం చెప్తావ్ అంటూ, కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఎలా పెద్దోడివి అయ్యావో నాకు తెలుసు, ఈ రోజు పెద్దోడివి అయిపోయి, నా బొచ్చు గురించి మాట్లాడుతున్నావు, దున్నపోతు అంటున్నావు, అవును పెద్దిరెడ్డి. నువ్వు దున్నపోతువు అయితే, నేను ఆవుని. ఒక అద్దం కొనుక్కొని చూస్కో. నేను బ్యాంకులకు టోకరా వేసినా ? ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నట్టే నేను దెబ్బ తిన్నా, నీ లాంటి అవినెతి సొమ్ము నాకు లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ పెద్దిరెడ్డి నన్ను రాజీనామా చేయమంటున్నాడు, దమ్ము, సిగ్గు గురించి మాట్లాడుతున్నాడు, నేను రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే, జగన్ ప్రభుత్వం బర్తరఫ్ చేసి, మళ్ళీ మీ ఎమ్మెల్యేలను గెలిపించుకోండి, దీనికి మీరు రెడీ అయితే, నేను రాజీనామాకు రెడీ అని కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి పెద్దిరెడ్డి ఏమి కౌంటర్ ఇస్తారో చూడాలి.