బెదిరించి గెలిచినా, డబ్బుతో గెలిచినా, అధికారంతో గెలిచినా, గెలుపు గెలుపే. తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇవి కారణాలుగా చెప్పటం కంటే, ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవలో సమీక్ష చేసుకుని, అవి సరి చేసుకుని ముందుకు వెళ్తే, జనరల్ ఎలక్షన్స్ నాటికి, తెలుగుదేశం పార్టీ ధీటుగా నిబలడుతుంది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే చరిత్ర అదే చెప్తుంది. ఎక్కడో 30 ఏళ్ళ నాటి సంగతి కాదు, గత తెలుగుదేశం హయాంలో లెక్కలు తీస్తేనే ఈ విషయం అర్ధం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన వివిధ ఎన్నికలు, అందులో వైసీపీ పని తనం చూసి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన తీరు చూస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో నేర్చుకోవచ్చు. ఓటమికి కుంగిపోకుండా, ఎదుటి వారి బలాన్ని చూసి భయపడితే, అదే టిడిపికి పెద్ద బలహీనత అవుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, కొన్ని నెలలకే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపతే, అక్కడ ఉప ఎన్నిక వస్తే, ఆ ఉప ఎన్నికలో పోటీ చేసే సాహసం కూడా వైసీపీ చేయలేదు. ఇక 2015 లో కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే, ఆ ఎన్నికలో కూడా వైసీపీ పోటీ చేయటానికి వెనకడుగు వేసింది. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు టిడిపి కనీసం పోటీ అయినా చేసింది, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి కూడా వెనకాడింది.

votes 15032021 2

ఇక అలాగే 2017లో తొమ్మిది స్థానాలకు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మూడు స్థానాలు కర్నూల్, మూడు స్థానాలు కడప, మూడు స్థానాలు నెల్లూరుకు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం అన్ని స్థానాల్లో టిడిపి గెలిచింది. ఇంకా చెప్పాలి అంటే, జగన్ సొంత బాబాయ్ వివేకను, పులివెందులలో కూడా టిడిపి ఓడించింది. ఓటమి ఎరుగని వైఎస్ ఫ్యామిలీకి ఓటమి రుచి చూపించింది టిడిపి. ఇక 2017 లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్. టిడిపిలో ఉన్న శిల్పాని లాక్కుని మరీ పోటీ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి ఇది సెమి ఫైనల్స్ అన్నారు. ఎనిమిది రోజులు అక్కడే ప్రచారం చేసారు. కట్ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ 30 వేల మెజారిటీతో గెలిచింది. తరువాత 2017 లో జరిగిన, కాకినాడ మునిసిపాలిటీ ఎన్నికల్లో 49 వార్డ్స్ లో 10 వార్డులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014-19 మధ్య జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఓడిపోయింది. కానీ 2019కి వచ్చే సరికి, ప్రభంజనం సృష్టించింది. అధికారం అనేది చేతిలో ఉంటే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అధికార పార్టీకే వస్తాయి అని చెప్పే లెక్కలు ఇవి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read