నిన్న వచ్చిన మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో, తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి గెలిచిన స్థానం కూడా, లాగేసుకోవటానికి వైసీపీ అనేక ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో జేసీ సోదరులు క్యాంప్ రాజకీయం ప్రారంభించారు. ఇక ఎక్స్ అఫిషియో మెంబెర్స్ విషయంలో కూడా వైసీపీ మైండ్ గేమ్ మొదులు పెట్టింది. అయితే టిడిపి మాత్రం, మాకు లైన్ క్లియర్ అని చెప్పుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేకపోయినా కూడా, ఎక్స్ అఫిషియో మెంబెర్స్ తో తాడిపత్రి మునిసిపాలిటీని కైవసం చేసుకోవటానికి ఎత్తు వేసారు. అయితే ఈ రోజు అధికారులు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చి, ఈ ఎన్నిక మొత్తానికి ట్విస్ట్ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో మెంబెర్స్ హోదా ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎక్స్ అఫిషియో మెంబెర్స్ గా ఎమ్మెల్సీలకు అవకాసం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇదే విషయం తమకు అనుకూలంగా మార్చుకుంది టిడిపి. తాడిపత్రి మునిసిపలటీలో తాము మెంబెర్లుగా ఉన్నామని, తమకు మునిసిపల్ చైర్మెన్ ఎన్నికలో పాల్గునటానికి వైసీపీ ఎమ్మెల్సీలు రాసిన లేఖ పై స్పందించిన మునిసిపల్ కమీషనర్, ఎన్నికల్ నియమావళి ప్రకారం, మీకు అనుమతి లేదని అధికారులు చెప్పారు.
దీంతో, వైసీపీకి ఈ దెబ్బతో, ఎక్స్ అఫిషియో మెంబర్స్ తో తాడిపత్రి కైవసం చేసుకుందాం అని ఎత్తు పారలేదని చెప్పాలి. అయితే టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కూడా, తనకు చైర్మెన్ ఎన్నికలో అవకాసం ఇవ్వాలని కోరారు. ఇక్కడ తనకు ఓటు కూడా ఉందని, ఓటు కూడా వేశానని, చైర్మెన్ ఎన్నికకు తనకు కూడా అవకాసం ఇవ్వాలని రాసారు. అయితే కొద్ది సేపటి క్రితమే, దీని పై స్పందించిన మునిసిపల్ కమిషనర్, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలతో పాటుగా, ఒక టిడిపి ఎమ్మెల్సీల అభ్యర్ధన తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. దీంతో ఒక్కసారి వైసీపీ షాక్ అయ్యింది. తగినంత మెజారిటీ లేకపోయినా, తాడిపత్రి కైవసం చేసుకోవాలని వేసిన ఎత్తు పారలేదు. మునిసిపల్ చైర్మెన్ ఎన్నిక కావలి అంటే, 19 ఓట్లు కావాల్సి ఉండగా, టిడిపికి 20 ఉండగా, వైసీపీకి 18 ఉన్నాయి. దీంతో టిడిపికి తాడిపత్రి మునిసిపాలిటీ కైవసం చేసుకోవటానికి లైన్ క్లియర్ అయ్యింది అనే చెప్పాలి. అయితే వైసీపీ మాత్రం, ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవటానికి పావులు కదుపుతుంది. మరి చివరకు ఏమి అవుతుందో చూడాలి.