జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనల సందర్భంగా, అసలు ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, లోపల ఏమి మాట్లాడుతున్నారు అనేది, సస్పెన్స్ గానే ఉండి పోతున్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి, ఇది మాట్లాడాం అని చెప్పరు. ఆయన మీడియాలో మాత్రం, హోదా పై మెడలు వంచేసరని, పోలవరం పై గడగడలాడించారు అంటూ రాస్తారు. అయితే అసలు ఆయన లోపల ఏమి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఏమి మాట్లాడుతున్నారు అనేది, ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా బయట పడింది. జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా, ఎవరిని కలిసినా, ఎవరికి మెమొరాండంలు ఇచ్చినా, అసలు ఆ మెమొరాండంలో ఏమి ఉంది, ఆ మెమొరాండంలో ఏమి ఇచ్చారు అనేది తెలియదు. ఆ మెమొరాండంలు కూడా ఎప్పుడూ మీడియాకు ఇవ్వరు. అయితే జగన్ మోహన్ రెడ్డి పలానా వాళ్ళని కలిసారు, రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై వాళ్ళతో చర్చించారు అనేది మాత్రమే, మీడియాకు చెప్తూ ఉంటారు. ఈ విషయంలో అనేక సార్లు మీడియా కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అసలు బయటకు చెప్పినట్టు, అక్కడ అడిగారా లేదా అనేది కూడా అందరికీ సందేహాలు వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇది బట్టబయలు అయ్యింది.
జనవరి 19వ తేదీన జగన్ మోహన్ రెడ్డి వచ్చి అమిత్ షా ని కలిసారు. అయితే ఫిబ్రవరి 19వతేదీన జగన్ వచ్చి అమిత్ షాని కలిసి, పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరారు, అటువంటి ప్రతిపాదన ఏమైనా ఉందా, కేంద్రం ఈ విషయంలో ఏమి చేయబోతుంది అంటూ, వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేంద్ర జల శక్తి మంత్రి సమాధానం ఇస్తూ, అటువంటి ప్రతిపాదన ఏది కేంద్ర హోం శాఖ వద్ద లేదు, అటువంటి మెమొరాండం కూడా ఏమి ఇవ్వలేదు అంటూ, చాలా స్పష్టంగా కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి, సమాధానంలో చెప్పారు. అయితే జనవరి 19వ తేదీన జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా ని కలిస్తే, పొరపాటున కానీ, లేదా ఎందుకో కానీ, ఫిబ్రవరి 19వ తేదీన అమిత్ షా ని కలిసారా అని ప్రశ్నించటం అందరినీ ఆశ్చర్యం కలిగింది. అయితే జనవరి 19వ తేదీన కూడా జగన్ మోహన్ రెడ్డి, మెమొరాండం ఏమి బయటకు ఇవ్వలేదు. కేవలం ప్రెస్ నోట్ ఒకటి పంపించారు. అయితే ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానంతో, పోలవరం అంచనాల పై, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు, జగన్ ఎటువంటి మెమొరాండం ఇవ్వలేదని తేలిపోయింది. మరి ఆ రోజు జగన్ ఎందుకు కలిసారో ఏమిటో ?