రేషన్ కోసం పేదలను రోడ్ల మీదకు తెచ్చి వైసీపీ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఇంటింటికీ రేషన్ అంటూ వీధుల్లో మహిళలను నిలబెట్టడం దుర్మార్గం .రేషన్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం నాడు రేషన్ డీలర్ల సంఘం నేతలు కలిసి తమ సమస్యలపై చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.... గతంలో వారంలోనే అందరికీ బియ్యం అందితే ఇప్పుడు నెలకు పది శాతం మందికి కూడా రేషన్ ఇవ్వలేకపోతున్నారు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ గోనెసంచులు కూడా వదలడం లేదు. జే-టాక్స్ కోసం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేశారు. కమీషన్ల కోసం వాహనాలను కొని ప్రజలను ఇక్కట్లు పెట్టారు. అదే రూ.1000 కోట్లతో రంజాన్ తోపా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు ఇవ్వొచ్చు. అన్నా క్యాంటీన్లు కొనసాగించి పేదల కడుపు నింపవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా పేదలకు రేషన్ సరిగా అందడం లేదు.

ration 07032021 2

గతంలో వీలు కుదిరినప్పుడు రేషన్ షాపులకు వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకునే వారు. కానీ ఇప్పుడు ఒక నిర్ధిష్ట సమయంలో మాత్రమే తీసుకునేలా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేజీకి 20 పైసలు ఉన్న కమిషన్ ను టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూపాయికి పెంచింది. వైసీపీ వచ్చాక డీలర్లను స్టాకిస్టులుగా మార్చింది. జగన్ రెడ్డి వచ్చాక వారికి చెల్లించాల్సిన బకాయిలు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజలకు రేషన్ ఇవ్వడానికి గతంలో ఒక్కో షాపునకు ఏడు వేలు ఖర్చు అయితే తుగ్లక్ పాలనలో రూ.28 వేలు ఖర్చు అవుతోంది. రేషన్ డీలర్లకు పెండింగ్ కమీషన్ ను వెంటనే అందించాలి, కరోనా సమయంలో రేషన్ అందిస్తూ కరోనా భారినపడి చనిపోయిన రేషన్ డీలర్లకు రూ.50 లక్షలు పరిహారం అందించాలని, రేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లను కొనసాగిస్తామన్నారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read