టీడీజీ జాతీయ అధ్యక్షుడు , రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం విజయవాడ నగరంలో పర్యటిస్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికలలో టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ, మధ్య, తూర్పు అసెంబ్లీ నియోజక వర్గాలలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటున్నారు. అయితే శనివారం విజయవాడలో పార్టీకి సంబందించి కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. దీంతో రూట్ మ్యాప్లో మార్పులు చోటు చేసు కున్నాయి. చంద్రబాబు నాయుడి రోడ్ షోలో ఆయా నియోజకవర్గాల ఇన్ ఛార్జులు. కార్పోరేషన్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు, మేయర్ అభ్యర్థి పాల్గొన్నారు. ఆయనకు ఉండే సమయం వెసులుబాటును బట్టి రూటు తాజాగా ఖరారు చేశారు. ముందుగా చంద్రబాబు షాహిద్ దర్గా నుంచి ప్రచారం మొదలు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాల పై ప్రజలకు అవగాహన కలిగించారు. ముఖ్యంగా జగన్ రెడ్డి వేస్తున్న పన్నుల బాదుడు పై ప్రజలకు అవగాహన కలిగించారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే నిన్న విజయవాడ టిడిపిలో జరిగిన పరిణామాల పై ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి పార్టీలో ఎవరూ మాట్లాడరు, బంట్రోతులులా కూర్చంటారు. మన పార్టీలో ఫ్రీడం ఎక్కువ అయింది, దాన్ని నేను కంట్రోల్ చేస్తా, మీకు నేను అభయం ఇస్తున్నా, ఇప్పుడు చెప్పకపోతే నేను భయపడ్డాను అనుకుంటారు అంటూ చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబు రోడ్ షో లో రూట్ ఇలా సాగనుంది.... షాహిద్ దర్గా, స్వాతి సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్తంభాల సెంటర్. సితారా సర్కిల్, సొరంగం రోడు, చిట్టినగర్ సెంటర్, కే బీ ఎన్ కాలేజీ రోడు, నె హ్రూ చౌక్, పంజా సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, లో బ్రిడ్పీ రైల్వే స్టేషన్, పాత ఆంధ్ర ప్రభ ఆఫీసు. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్, ఎర్రకట్ట, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపే ట, సింగ్ నగర్ పెట్రోల్ బంక్, పైపుల రోడు, నున్న పోలీసు స్టేషన్, ప్రకాష్ నగర్ మెయిన్ రోడులలో రోడ్ షో ముగించుకుని మరల సింగ్ నగర్ పై ఓవర్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి బుడమేరువంతెన, ముత్యాలం పాడు ప్రభుత్వ ప్రెస్, బీ ఆర్ టీ ఎస్ రోడ్ను మోడర్న్ సూపర్‌మార్కెట్, చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ సెంటర్, మె ట్రో, సిదార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి , అమ్మకల్యాణ మండపం, ఎగ్జిక్యూటివ్ క్లబ్ సర్కిల్, గురునానక్ కాలనీ రోడు, పటమట రైతుబజారు రోడ్డు, ఆటోనగర్ గేట్ యుటర్న్, ఎన్ టీ ఆర్ సర్కిల్, బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి కృష్ణలంక హైవే ఫీడర్ రోడ్డు, బాలా జీనగర్, రాణిగారి తోట, ఎం హోటల్, సత్యంగారి హోటల వరకు రోడ్ షో సాగుతుంది. అక్కడ రోడ్ షో ముగుస్తుంది.