తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస రావు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాటల్లో "ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస రావు, సంఘం అధికారులు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ లేఖ రాయడం హాస్యాస్పదం. లేని పవిత్రను చాటుకునేందుకు సంఘం నేతలు ఆరాటపడి ప్రజలముందు భంగపడ్డారు. ఆ లేఖపై క్షేత్రస్థాయిలో పోలీసులు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. లేఖ రాయాడాన్ని పోలీసులు అవమానంగా భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రాగానే లేఖ రాసేస్తారా? డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీ హయాంలో సవాంగ్ మంచి అధికారిగానే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరగలేదు, జనంతో ఛీ కొట్టించుకోలేదు. నాలుగుసార్లు డీజీపీ హైకోర్టుకు వెళ్లారు. కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేతులు కట్టుకుని నిలబడినందుకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇలాంటి అవమానం దేశంలో ఏ డీజీపీకి అయినా జరిగిందా ? పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను డీజీపీ సవాంగ్ దిగజార్చారు. ఇలాంటి వ్యక్తి డీజీపీగా ఉండటం దురదృష్టకరమని పోలీసు అధికారుల సంఘానికి అనిపించలేదా? మీరు చెప్పే అరాచకాలు చేయలేక క్షేత్రస్థాయిలో పోలీసులు మనసు చంపుకుంటున్నారు. గౌతమ్ సవాంగ్ డీజీపీ అయ్యాక దళితులపై దాడులు పెరిగాయి. శిరోముండనాలు జరిగితే మీకు సిగ్గనిపించలేదా? గౌరవప్రదమైన పోలీస్ స్టేషన్ ను బార్బర్ షాపుగా మార్చితే మీకు సిగ్గు అనిపించలేదా? ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే దోషులను శిక్షించమని కోరిన బాధితులపై పోలీస్ స్టేషన్ లో ఏం మాట్లాడారో గుర్తు లేదా? న్యాయం జరగడంలేదని బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రాజు గారు, రెడ్డి గారి మెప్పు కోసం శాంతిభద్రతలను కాలరాస్తుంటే ప్రశ్నించకూడదా? గతంలో సంవాంగ్ ఎలా ఉండే వారో ఇప్పుడెలా తయారయ్యారో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. "

"చంద్రబాబు ఏనాడు పోలీసులను అవమానించలేదు. జగన్మోహన్ రెడ్డితో స్నేహం బొగ్గుతో స్నేహం లాంటిదని పోలీసు సంఘాలు గుర్తించాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతికి ఎందరో అధికారులు బలయ్యారని గుర్తు చేసుకోండి. ఏది మంచి ఏది చెడు అనేది పోలీసు సంఘాలు ఆలోచించుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మీరు హెచ్చరిస్తారా? బెదిరిస్తారా? పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తున్న వారిని హెచ్చరించండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమంటే హెచ్చరిస్తారా? వైసీపీ కార్యకర్త డీజీపీ స్థాయి అధికారిని నెట్టేస్తే ...నేనే జారిపడ్డానని చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీ స్థాయి పెంచారు. ఆనాడు పోలీసు సంఘం అధ్యక్షులుగా ఉన్న గోరంట్ల మాధవ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని ఆశ్రమంలో జరిగిన అవినీతిపై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు గోరంట్ల ఎంత రగడ చేశారో ఎవరూ మర్చిపోలేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ...పోలీస్ అధికారిని ఎలా బెదిరించారో చూశాం. బొంగులో పోలీసులని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీసి పారేశాడు. తాడికొండ ఎమ్మెల్యే పోలీసులను పూచికపుల్లలా తీసిపడేసింది. మరో నేత ఆమంచి కృష్ణ మోహన్ ...కొజ్జా పోలీసులని మాట్లాడారు. వైసీపీ నేతల వల్ల పోలీస్ శాఖ గౌరవం పెరిగిందా? ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా పోలీసు సంఘం నోరు మెదపదేంటి? కప్పం రాదు, ఉన్న పోస్టు పోతుందని భయపడుతున్నారా? ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. తాడేపల్లి బాస్ లు ఇచ్చే ముడుపుల కోసం కక్తుర్తి పడి ఇలాంటి లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తూ లేఖలు రాసే మొనగాళ్లా మీరు? 21 నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. ఏపీని మరో బీహార్ లా మార్చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు చేసినవారిని పోలీసులు పట్టుకోలేకపోయారు. పోలీస్ సంఘం నేతలు అధికార పార్టీకి చేస్తున్న ఊడిగం వల్ల నిజమైన పోలీసుల పరువు పోతోంది. మీ చర్యలు, తీరును చూసి క్షేత్రస్థాయిలో పోలీసులు అసహ్యించుకుంటున్నారని పోలీసు సంఘం నేతలు గుర్తించాలి" అని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read