జగన్మోహన్ రెడ్డి ఉరఫ్ జగన్ బాబు కన్ను గ్రామీణ ప్రాంతాలప్రజలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న పాడి పరిశ్రమపై పడిందని, దాన్నిదోచేసి తద్వారావచ్చే సంపదను తనసొంతఖజనాకు మళ్లించుకోవడానికి 6, 7నెలలనుంచీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాడిపరిశ్రమను దిగమింగడానికి జగన్ బాబు గుజరాత్ లోని అమూల్ సంస్థను తెరపైకితెచ్చాడని, వాస్తవానికి ఆ రాష్ట్రంలోని సబర్ కాంతా డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. రై తాంగానికి అండగా ఉంటున్న అనేక ప్రైవేట్ డెయిరీలను నాశనంచేయడానికి సబర్ కాంతా డిస్ట్రిక్ట్ మిల్క్ యూని యన్ తోప్రభుత్వం ఒప్పందంచేసుకుందన్నారు. మరీ ప్రధానంగా హెరిటేజ్ డెయిరీని దెబ్బతీయాలని, చంద్రబా బునాయుడి గారిఆర్థికమూలాలను దెబ్బతీయాలనే జగ న్ బాబు అమూల్ ముసుగులో సబర్ కాంతా డిస్ట్రిక్ట్ మి ల్క్ యూనియన్ సంస్థతో ఒప్పందంచేసుకున్నాడని శ్రీ నివాసరెడ్డి తేల్చిచెప్పారు. సదరు సంస్థతో జగన్ ఒకరక మైన క్విడ్ ప్రోకో ఒప్పందమే చేసుకున్నాడన్నారు. 2019ఎన్నికలకు ముందు తనప్రభుత్వం అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని పాలఉత్పత్తిదారులకు మేలుచేసేలా లీటర్ కి రూ.4లు బోనస్ ఇస్తానని జగన్ చెప్పడం జరి గిందన్నారు. 23నెలలుగా పాడిరైతులకుఇవ్వాల్సిన బోనస్ ను పట్టించుకోని ఫేక్ ముఖ్యమంత్రి చిల్లికానీ కూడా వారికి ఇవ్వలేదన్నారు. విజయ బ్రాండ్ అనేది ఏపీ బ్రాండ్ అని, దాన్ని వదిలేసి గుజరాత్ లోని సబర్ కాంతా డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ బ్రాండ్ అయిన అమూల్ కు జగన్ బాబు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడో ప్రజలకు సమాధానంచెప్పాలన్నారు. సబర్ కాంతా డెయిరీతో చేసుకున్న క్విడ్ ప్రోకో ఒప్పందంలో భాగంగానే, సహకార రంగంలోని పాడిరైతులు, పాల ఉత్పత్తిదారులకు బోనస్ లు, డివిడెండ్ల రూపంలో దక్కాల్సిన సొమ్ముని తానుకాజేయడానికి సిద్ధమ య్యాడన్నారు.
గుంటూరుజిల్లాలోని సంగండెయిరీ, సబర్ కాంతాసంస్థకంటే ఎక్కువగా రైతులకు లీటర్ పాలకు ఎక్కువధరను చెల్లిస్తోందని, గేదెలకు దాణా, పశుగ్రాసవిత్తనాలసరఫరా, గేదెలకొనుగోలు కోసం ఇచ్చేరుణాలరూపంలో సంగం డెయిరీ అన్నివిధాల పాడి రైతులకు అండగా ఉంటోందన్నారు. సంగండెయిరీకి ఇస్తే తనకేమి వస్తుందని అనుకున్న జగన్ బాబు సబ ర్ కాంతా పేరుతో క్విడ్ ప్రోకో ఒప్పందం చేసుకున్నాడని మర్రెడ్డి తెలిపారు. 45ఏళ్లు నిండినిప్రతిమహిళకు పింఛన్ ఇస్తాననిచెప్పిన జగన్, అదిచేయకుండా ఒకఏడాదిగడిచాక, రెండోఏడాది రూ.18,750ఇచ్చి, ఆ డబ్బుతో గేదెనుకొని అమూల్ సంస్థక పాలుపోస్తే, మిగిలిన సొమ్ము ఇస్తానంటూ మెలికపెట్టాడన్నారు. బలవంతంగా మహిళలతో గేదెలు కొనిపిస్తే,దానికి మేత , తవుడు, దాణా, కట్టేయడానికిజాగాఎక్కడినుంచి వస్తు దో చెప్పాలన్నారు. పథకంపేరుతో పూర్తిగా మహిళలకు పంగనామాలు పెట్టడానికి, అమూల్ సంస్థను బాగు చేయడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన తిరకాసు వ్యవ హారంపెట్టాడని శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. గ్రామాల్లో పా లసేకరణ కేంద్రాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయని, వారిచ్చేదానితో పోలిస్తే జగన్ బాబుఇచ్చేది బోడితో సమానమన్నారు. గ్రామాల్లో గేదెలుకొనడానికి ఆయా సేకరణకేంద్రాల వారెవరూ పాడిరైతులతో జగన్ బాబులా తిరకాసు ఒప్పందాలు చేసుకోవడం లేదన్నారు. సబర్ కాంతా మిల్క్ యూనియన్ ని బాగుచేయడానికి మహి ళలను అడ్డుపెట్టుకొని, పాడిరైతులను దోపిడిచేయడాని కి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడన్నారు. అమూల్ డెయిరీ వారు ఇక్కడెలాంటి యూనిట్లు పెట్టలేదని, అం దుకోసం ప్రజలసొమ్ముని సదరు సంస్థకు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడన్నారు. జగన్ బాబు విజయమ్మతో లేఖరాయించి తనబండారాన్ని తానే బయటపెట్టుకోవాలన్నారు. అమూల్ అభివృద్ధి కోసం 7,125 గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాల నిర్మాణం చేపట్టి, అందుకోసం రూ.1362కోట్లను ఖర్చుపెట్టాలని జగన్ నిర్ణయించడన్నారు.
పాలసేకరణ కేంద్రాల ముసుగులో ప్రజలసొమ్ముని సబర్ కాంతా డెయిరీ అభివృద్ధికి కేటాయించడం, రూ.272కోట్లను మౌలికవసతుల పేరు తో ముఖ్యమంత్రి ప్రభుత్వంతరుపున పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధమయ్యాడన్నారు. అమూల్ రూపాయి పెట్టకపోయినా ప్రభుత్వమే జామీనుదారుగా ఉండి, సదరు సంస్థకు జాతీయసహకారఅభివృద్ధ సంస్థనుంచి అప్పుఇప్పించడానికి సిద్ధమైందన్నారు. గ్రామాల్లోని పాలసేకరణవ్యవస్థను పూర్తిగా నాశనంచేసి, ఇసుకపాల సీ ఎలాగైతే జే.పీ పవర్ వెంచర్స్ కిందకుపోయిందో, పాలఉత్పత్తిదారులవ్యవస్థ సంపదను దోచుకోవడానికి జగన్ బాబు సిద్ధమయ్యాడన్నారు. ఆయన పాపపు కన్ను రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థలపై పడిందన్నారు. జగన్ బాబు రాష్ట్ర్రానికి ముఖ్యమంత్రా లేక సబర్ కాంతా డెయిరీకి సీఈవోనా అనే అనుమానం కలుగుతోందన్నా రు. దొంగలు, అవకాశవాదులు, లంచగొండులు, అవినీతిపరులు మాత్రమే ప్రభుత్వరంగంలోఉంటూ, ప్రైవేట్ సంస్థలకు వత్తాసుపలుకుతారన్నారు. కార్మికు లను, కూలీలను రోడ్డునపడేసేలా జాతీయ ఉపాధి హామీపథకం నిధులను ముఖ్యమంత్రి గుజరాత్ పాలకంపెనీకి ఖర్చుచేస్తున్నాడన్నారు. 150లక్షలమెట్రిక్ టన్నుల పాలఉత్పత్తి రాష్ట్రంనుంచి వస్తుంది కాబట్టి, దానిపై వచ్చేఆదాయాన్నిదోచుకోవాలని జగన్ బాబు ఈవిధమైన కుట్రపూరిత ఆలోచనలకు తెగబడుతున్నా డన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగిందని, దానిలో జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఎక్కువైందని, ప్రతి రైతుభరోసా కేంద్రంనుంచి పూటకు రెండు క్యాన్లపాలైనా పంపాలని ఆదేశించడం జరిగింద న్నారు. గ్రామాలపై పడి, పాలఉత్తత్తిదారులను బెదిరిం చాలని, లేకుంటే పథకాలుఆపేస్తామని చెప్పాలని అధి కారులు ఆదేశించిన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోందన్నారు. పరిపాలన చేయడం చేతకా కుంటే జగన్ బాబు తనపదవికిరాజీనామాచేసి, ఆయ నకు చేతనైన విద్యను ప్రదర్శించుకోవచ్చని శ్రీనివాసరెడ్డి హితవుపలికారు.