సహజంగా ప్రతిపక్ష పార్టీ నుంచి, అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్న చోట, ఎవరైనా భయపడుతూ, వన్ సైడ్ అవ్వాల్సిందే. ఇక్కడ బెదిరింపుల పర్వం అలా ఉంటుంది. మేము బెదిరిపోం, మేము అన్నం తినే వాళ్ళం ఆ పార్టీలో చేరం అని చెప్పిన వాళ్ళే, తోక ముడుచుకుని ఆ పార్టీలో చేరిపోయారు అంటే, పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అవ్వటం, నెమ్మదిగా ప్రజల్లో వ్యతిరేకత రావటంతో, నాయకుల్లో కూడా మార్పు మొదలైంది. ఇప్పుడు వెరైటీగా, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు వస్తున్నాయి. అన్ని పంచాయతీలు మావే, అన్ని మునిసిపాలిటీలు మావే, అన్ని జిల్లా పరిషత్ లు మావే , ఇది మా ప్రజా బలం అని చెప్పుకుంటున్న వైసీపీకి, కడప జిల్లాలోనే షాక్ తగిలింది. కడప జిల్లాలోని రాయచోటికి చెందిన, వైసీపీ కీలక నేత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని, శ్రీకాళహస్తిలో కలిసారు, వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ నెల 14వ తేదీన అయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
ఈ నేపధ్యంలోనే ఆయన చంద్రబాబుని కలిసారు. చంద్రబాబు కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా కడప జిల్లా రాయచోటిలో, వైసిపీ ఎమ్మెల్యేగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎన్నికల్లో గెలుపు విషయంలో, రాంప్రసాద్ రెడ్డి కూడా కీలక పాత్ర వహించారని చెప్తూ ఉంటారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కానీ, మొన్న ప్రకటించిన కార్పొరేషన్లలో కానీ ఏదో ఒక పదవి వస్తుందని, ఆశగా ఎదురు చూసారు. తనకు పదవి వస్తుందని, వైసీపీ పెద్దలు కూడా నమ్మిస్తూ వచ్చారని, అయితే రెండేళ్ళు దాటుతున్నా, పదవి సంగతి పక్కన పెడితే, కనీసం గుర్తింపు కూడా పార్టీలో లేకుండా పోయిందని, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక వైసీపీ పార్టీలో, అవమానాలతో, అసంతృప్తి ఉండలేనని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు, ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే ఆయన నిర్ణయం పై ఇప్పటి వరకు, స్థానిక వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఆయన మాత్రం తన అనుచరులతో సమావేశం అయ్యి, నిర్ణయం తీసుకున్నారు.