సామాన్యులు సొంత ఇంటి కల నిజం చేసుకోవాలి అంటే, చాలా మంది బ్యాంకు రుణాల మీద ఆధారపడి ఇల్లు కట్టుకుంటారు. ఒక లోన్ మన పేరు మీద ఉండగా, మరో లోన్ ఏ బ్యాంకు ఇవ్వదు. అది కూడా ఇల్లు కట్టుకుంటా అని లోన్ తీసుకుని, ఇల్లు కట్టకుండా, ఆ డబ్బులు వాడేసుకుని, ఇప్పుడు మరో కొత్త రుణం కోసం, అదే బ్యాంక్ కు వెళ్తే, అక్కడ బ్యాంకు వాడు చెప్పేది, ముందు పాత లోన్ తీసుకున్న డబ్బులతో, ఇల్లు కట్టి చూపించు, అప్పుడు కొత్త లోన్ గురించి ఆలోచిస్తాం అని చెప్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు అయ్యింది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేవలం అప్పులతో నెట్టుకుని వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రం షాకుల మీద షాకులు ఇస్తుంటే, ఇప్పుడు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, నిర్మాణాలు పూర్తి చేయటానికి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ, లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే, అక్కడ షాక్ తగిలింది. ఇప్పటికే మీకు గతంలో 3 వేల కోట్లు రుణాలు ఇచ్చామని, అమరావతిలో ఆ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి, క్లోజర్ రిపోర్ట్ లు మాకు చూపిస్తే, అప్పుడు మీకు కొత్త రుణం గురించి అలోచిస్తామని చెప్పటంతో, జగన్ ప్రభుత్వం షాక్ తింది. గతంలో అమరావతిలో అనేక నిర్మాణాలు చంద్రబాబు చేపట్టారు. వైసీపీ అవి గ్రాఫిక్స్ అని హేళన చేసినా, అక్కడకు వెళ్లి చూసిన వారికి అవి ఏంటో తెలుస్తాయి.

amaravati 09042021 2

ఈ నిర్మాణాల కోసం, అప్పట్లో సిఆర్డీఏ, రూ.2,060 కోట్ల లోన్ తెచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల కన్సార్షియం, ఈమూడు బ్యాంకులు కలిసి ఈ లోన్ ఇచ్చాయి. వాటిల్లో చాలా వరకు 90 శాతం వరకు నిర్మాణాలు పూర్తీ అయ్యాయి. అయితే ఎన్నికల్లో చంద్రబాబు, ఓడిపోవటం, జగన్ గెలవటంతో, అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అయితే అమరావతి ప్రాంతంల్లో రైతుల ఆందోళన, కోర్టులలో కేసులతో, అలాగే రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఇక్కడ నిర్మాణాలు కొంత మేరకు చేయాలని జగన్ ప్రభుత్వం భావించి, మళ్ళీ ఇదే బ్యాంకుల కన్సార్షియం వద్దకు 10 వేల కోట్లు రుణం కావాలని, మొదటి విడతగా 3 వేల కోట్లు కావలని వెళ్లారు. అయితే అనూహ్యంగా బ్యాంకులు అడ్డం పడ్డాయి. ఇది వరకు లోన్ తెసుకున్న బిల్డింగ్ లు ముందు కట్టి చూపించండి, తరువాతే కొత్త రుణం ఇస్తామని మెలిక పెట్టాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం, ఏమి చేయాలి అనే దాని పై తర్జన బర్జన పడుతుంది. మళ్ళీ కొత్త బ్యాంకు కోసం వెళ్తే, ఈ ప్రాసెస్ అంతా అయ్యే సరికి, ఏడాదికి పైగా పడుతుంది. ఈ లోపు, కోర్టులో, మీరు వచ్చిన తరువాత అమరావతికి ఏమి చేసారు అంటే, ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. మరి ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read