ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల నిర్వహణకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ, పలువురు వేసిన పిటీషన్ల పై, నేడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని, హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 30వ తారిఖుకు ఈ కేసు వాయిదా వేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు పంపిస్తూ, వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలకు సంబంధించిన అంశం తమ వద్ద ఉందని, దానికి సంబంధించి ఆలోచన ముందుకు వెళ్తుందని చెప్పింది. అయితే ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు అనేది మాత్రం, ఎన్నికల కమిషన్ విచక్షణ పై ఆధారపడి ఉంటుంది, వాళ్ళే ఆ తేదీలు ఖరారు చేయాల్సి ఉంటుందని, ఎన్నికలు నిర్వహించాలి మేము ఆదేశించలేమని, దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని చెప్పి, హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ మాత్రం, ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ, ప్రతివాదులు అందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలని, ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితిలో ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.
ఇలా ఎన్నికలు పెట్టాలని మేము ఆదేశించలేమని, ఎన్నికల కమిషనే నిర్ణయంచాలని, హైకోర్టు చెప్పింది. అయితే ఈ నెల 31వ తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కలాం ముగుస్తుంది. అయితే ఈ లోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆయన పై ఒత్తిడి తెస్తుంది. అయితే కోర్టు నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటాం అని నిమ్మగడ్డ ఇప్పటికే స్పష్టం చేసారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసి నామినేషన్ల సందర్భంలో జరిగిన బలవంతపు ఏకాగ్రీవాలు రద్దు చేయాలని, ఇప్పటికే పలువురు కోర్టుకు వెళ్ళారు. అది తేలే వరకు, ఎన్నికల షడ్యుల్ ఇవ్వటం కుదరదని, ఇప్పటికే పరోక్షంగా చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం, ఆయన పై ఒత్తిడి తెస్తుంది. ఆయన నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటంతో, కొంత మంది కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, తాము ఆ ఆదేశాలు ఇవ్వలేమని చెప్తూ, కేసుని ఈ నెల 30కి వాయిదా వేసింది. అంటే ఇక నిమ్మగడ్డ ఉండగా, ఈ ఎన్నికలు జరిగే అవకాసం లేదు.