ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో పని చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సాయంత్రం ఆయన చేసే డిబేట్ లు, ప్రజలను ఎంతగానే ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై, ఆయన చేసే చర్చలు అర్ధవంతంగా ఉంటాయి. ఎక్కడా అరుపులు, కేకలు లేకుండా అర్ధవంతంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే నిన్నటి నుంచి వెంకటకృష్ణ పై విష ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి సంబందించిన కార్యకర్తలు, ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఆయనను ప్రస్తుతం పని చేస్తున్న ఛానల్ తప్పించిందని, వెంకటకృష్ణ బ్లాక్ మెయిల్ చేసారు, డబ్బులు తీసుకున్నారు అంటూ విష ప్రచారం మొదలు పెట్టారు. నిన్న ఆయన కూడా డిబేట్ కి రాకపోవటంతో, ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయ్యింది. అయితే దీని పై వెంటనే వెంకటకృష్ణ తన ట్విట్టర్ లో స్పందించారు. ప్రయాణంలో ఎన్నో మజిలీలు, సవాళ్లు ఉంటాయని, ఇప్పటికి అయితే కేవలం సెలవు మాత్రమే తీసుకున్నానని, ఏమైనా ఉంటే త్వరలో చెప్తానని, నా పైన కొంత మంది సునకానందం గాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటూ, అవి పట్టించుకోకండి అని ట్వీట్ చేసారు. అయితే ఈ రోజు ఉదయానికి ఈ ప్రచారం తారా స్థాయికి చేరింది. వెంకట కృష్ణకు, ఆ టీవీ యాజమానికి గొడవ అయినట్టు ప్రచారం చేసారు.

vk 24032021 2

అంతే కాదు, మొన్న డిబేట్ లో జరిగిన చెప్పు దెబ్బ ఎపిసోడ్ లో వాస్తవాలు ఉన్నాయి అంటూ, వెంకట కృష్ణ బెదిరిస్తున్నారు అంటూ, హడావిడి చేస్తున్నారు. దీని పై కూడా వెంకట కృష్ణ ఈ రోజు ఘాటుగా స్పందించారు. నా పేరుతొ ఫేక్ ఎకౌంటు రెడీ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన యజమాని అంటే తనకు అమితమైన గౌరవం ఉందని అన్నారు. నేను ప్రస్తుతానికి అక్కడ కేవలం సెలవు మాత్రమే పెట్టానని, సెలవులో ఉన్నానని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పై లీగాల్ గా ప్రొసీడ్ అవుతాను అంటూ, హెచ్చరిస్తూ, ఇలా ప్రచారం చేస్తున్న వారి వివరాలు తెలిస్తే ఇవ్వాల్సిందిగా కోరారు. మొత్తానికి, ఒక సామాన్య జర్నలిస్ట్ విషయంలోకూడా, ఒక పార్టీకి చెందిన మొత్తం సోషల్ మీడియా వింగ్ మొత్తం ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్ధం కావటం లేదు. తమకు నచ్చకపోతే, రాజకీయ నాయకులనే కాదు, ఎవరినీ వదలం అని ఆ పార్టీ సోషల్ మీడియా చెప్పకనే చెప్తుంది. ఏది ఏమైనా, సమాజంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ ధోరణి ఎక్కడ దాకా వెళ్తుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read