ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా ఉన్న నిమ్మగడ్డ రామేశ్ కుమార్, రాష్ట్ర గవర్నర్ కు రాసిన లేఖలు, బయటకు లీక్ కావటం పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్, శనివారం రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై కేంద్ర దర్యాప్తు సంస్థల్లో, ముఖ్యంగా సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ కార్యాలయానికి, రాజ్యంగబద్ధ సంస్థకు అధిపతిగా ఉన్న తాను రాసిన లేఖను బయటకు లీక్ చేయటం అనేది, హక్కులకు విరుద్ధం అని, ఇటువంటి చర్యలు మంచిది కాదని, ఆయన పిటీషన్ లో తెలిపారు. పైగా తాను రాసిన లేఖను, హైకోర్టులో దాఖలు అయిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో, ఒక పిటీషనర్ తన పిల్ లో పేర్కొన్నారని, ఈ లేఖలు ఎలా లీక్ అయ్యయో, తెలుసుకోవాలని ప్రశ్నించారు. దీని పై వెంటనే, తగిన విచారణ జరిపించాలని ఆయన కోరారు. దీంట్లో ప్రతివాదులుగా రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్సా సత్యన్నారయణతో పాటుగా, గవర్నర్ కార్యదర్శిని కూడా ప్రతి వాదులుగా చేర్చారు. దీంతో హైకోర్టు ఈ అంశం పై విచారణ జరిగిపింది. అయితే ఆ బెంచ్ జడ్జి నాట్ బిఫోర్ మీ అని తప్పుకోవటంతో, ఈ పిటీషన్ మరో బెంచ్ ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశం పై ఎలక్షన్ కమిషన్ తరుపున న్యాయవాదులు, తమ పిటీషన్ లోని అంశాలు హైకోర్టుకు చెప్పారు.
ఈ రోజు విచారణ సందర్భంగా, హైకోర్టు స్పందిస్తూ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మరో మంత్రి బొత్సా సత్యన్నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు పై, వాళ్ళ వివరణ ఇవ్వాలని కోరారు. అదే విధంగా ప్రతి వాదులుగా పేర్కొన్న మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసారు. అయితే ఈ లేఖలు బయటకు విడుదల అయ్యాయని, దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ కూడా, ఈ రోజు తన పిటీషన్ లో, ఎన్నికల కమిషన్ జత చేసారు. ఇక గవర్నర్ సెక్రటరీ కూడా స్పందిస్తూ, గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రివిలేజ్ లెటర్స్ లీక్ అవ్వలేదని చెప్పారని, హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది. వీటి అన్నిటి పై కూడా, మంత్రులు, ప్రతి వాదులు ఇచ్చే సమాధానం పై, ఈ పిటీషన్ పై తదుపరి విచారణ జరగనుంది. అయితే దీని పై మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. తమకు ఆ లేఖలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయం కోర్టుకు ఎలా చెప్తారు అనే విషయం ఇప్పుడు కోర్టులో తేలుతుంది.